PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-amit-shah-bjp-modi-0d0d47a5-634e-4d91-a46f-2f0abb0d61f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-amit-shah-bjp-modi-0d0d47a5-634e-4d91-a46f-2f0abb0d61f7-415x250-IndiaHerald.jpg తాను అమిత్ షా ను కలిసింది కేసుల కోసమో లేకపోతే కేసుల్లో ఇరుక్కున్నవాళ్ళని రక్షించమని అడగటం కోసమో కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే భేటీ అయినట్లు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రప్రయోజనాల కోసం అమిత్ షా తో భేటీ అయ్యారంటే ఎవరు నమ్మటంలేదు. సరే విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ ధియోధర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సునీల్ మాట్లాడుతు అసలు అమిత్ షా తో చంద్రబాబు భేటీనే కాలేదన్నారు.TDP BJP{#}Bharatiya Janata Party;Amith Shah;MP;central government;sunil;Party;Hyderabad;Yevaru;Minister;CBN;mediaఢిల్లీ : అమిత్-చంద్రబాబు భేటీ జరగలేదా ?ఢిల్లీ : అమిత్-చంద్రబాబు భేటీ జరగలేదా ?TDP BJP{#}Bharatiya Janata Party;Amith Shah;MP;central government;sunil;Party;Hyderabad;Yevaru;Minister;CBN;mediaSat, 10 Jun 2023 05:00:00 GMT



చంద్రబాబునాయుడు కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈమధ్యనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబు 50 నిముషాలు భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. భేటీ తర్వాత మామూలుగా మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఎవరితోను మాట్లాడలేదు. సమావేశంలో ఏమి జరిగిందో లీకులు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కూడా భేటీ విషయాలను చంద్రబాబు పంచుకోలేదు.




తాను అమిత్ షా ను కలిసింది కేసుల కోసమో లేకపోతే కేసుల్లో ఇరుక్కున్నవాళ్ళని రక్షించమని అడగటం కోసమో కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే భేటీ అయినట్లు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రప్రయోజనాల కోసం అమిత్ షా తో భేటీ అయ్యారంటే ఎవరు నమ్మటంలేదు. సరే విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ ధియోధర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సునీల్ మాట్లాడుతు అసలు అమిత్ షా తో చంద్రబాబు భేటీనే కాలేదన్నారు.




అమిత్-చంద్రబాబు మధ్య భేటీ జరిగినట్లు వచ్చిన వార్తలంతా అబద్ధాలే అన్నారు. నిజంగానే వాళ్ళమధ్య భేటీ జరిగుంటే దానికి సంబంధించిన ఫొటోను చంద్రబాబు ట్విట్టర్లో పోస్టు చేసుండేవారే కదాని ఎదురు ప్రశ్నించారు. భేటీపై మీడియాతో మాట్లాడలేదు, ట్విట్టర్లో ఫొటో కూడా పోస్టుచేయలేదంటే ఏమిటర్ధమని సునీల్ అడిగారు. దాంతో మీడియాలో గందరగోళం మొదలైంది. భేటీ జరిగుంటే జరగలేదని సునీల్ ఎందుకు చెప్పారు ?  నిజంగానే జరగకపోతే ఢిల్లీలో చంద్రబాబును ఎవరిని కలిశారు ?




అమిత్ షా ను కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారనే మీడియాలో ప్రచారం జరిగింది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత చంద్రబాబు ఎవరిని కలిశారనేది తెలీదు. ఎంపీ గల్లా జయదేవ్ క్వార్టర్స్ నుండి ఒంటరిగా బయలుదేరారు. వెళ్ళేటపుడు చంద్రబాబుతో ఎంపీలెవరు లేరు.  గంట తర్వాత మళ్ళీ ఒంటరిగానే క్వార్టర్స్ కు తిరిగొచ్చారు. మరుసటిరోజు హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. మీడియా చెప్పింది కూడా ఇదే. ఎల్లోమీడియా కూడా ఢిల్లీలో అమిత్ షా భేటీపై ఎలాంటి వార్తలు, కథనాలు ఇవ్వలేదు. ఎల్లోమీడియా సైలెంటుగా ఉండటమే కాకుండా సునీల్ తాజా ప్రకటనతో గందరగోళం పెరిగిపోతోంది.




RRR Telugu Movie Review Rating

చినజీయర్‌ మేనల్లుడి లీలలపై ఆంధ్రజ్యోతి సంచలన కథనం?

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>