MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas--adipurush5b534235-f3cf-425b-bed2-41f65043ff9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas--adipurush5b534235-f3cf-425b-bed2-41f65043ff9d-415x250-IndiaHerald.jpg‘ఆదిపురుష్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికేట్ ఈమూవీకి సెన్సార్ బోర్డ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 179 నిముషాలు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. దీనితో ఈసినిమాను చూసే ప్రేక్షకుడు 3 గంటలు ధియేటర్ లో కూర్చోవలసిన పరిస్థితి. సాధారణంగా ప్రస్తుతరం ప్రేక్షకులు పెద్ద నిడివి గల సినిమాలను చూడటానికి ఆశక్తి కనపరచడం లేదు.అయితే ఈవిషయంలో ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలను మూడు గంటలు నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్prabhas adipurush{#}Government;Industry;Ayodhya;Nijam;Audience;Telugu;Cinemaఆదిపురుష్ ని కరుణించిన ప్రభుత్వ రాయితీలు !ఆదిపురుష్ ని కరుణించిన ప్రభుత్వ రాయితీలు !prabhas adipurush{#}Government;Industry;Ayodhya;Nijam;Audience;Telugu;CinemaFri, 09 Jun 2023 10:00:00 GMT‘ఆదిపురుష్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికేట్ ఈమూవీకి సెన్సార్ బోర్డ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 179 నిముషాలు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. దీనితో ఈసినిమాను చూసే ప్రేక్షకుడు 3 గంటలు ధియేటర్ లో కూర్చోవలసిన పరిస్థితి. సాధారణంగా ప్రస్తుతరం ప్రేక్షకులు పెద్ద నిడివి గల సినిమాలను చూడటానికి ఆశక్తి కనపరచడం లేదు.


అయితే ఈవిషయంలో ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలను మూడు గంటలు నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూ చూశారు. మరి అలాంటి మ్యాజిక్ ‘ఆదిపురుష్’ లో ఎంతవరకు ఉంటుంది అన్న విషయం ఈమూవీ ఫస్ట్ షో ఫస్ట్ టాక్ బయటకు వస్తే కాని తెలియదు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ‘ఆదిపురుష్’ కలక్షన్స్ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.


ఒక్క నైజాం ప్రాంతంలోనే ఈమూవీ మొట్టమొదటిరోజు 25 కోట్లు గ్రాస్ కలక్షన్స్ వసూలు చేస్తుంది అని వస్తున్న అంచనాలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈమూవీకి సంబంధించి నైజాం ఏరియా అంచనాలు నిజం అయితే ఈమూవీ తెలుగు రాష్ట్రాలలో కేవలం మొట్టమొదటిరోజునే 75 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూల్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.


ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఈమూవీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినోద పన్నులో రాయితీ ఇచ్చి ఈసినిమాను మరింత ఎక్కువమంది చూసే విధంగా ప్రోత్సహించాలని ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో రామజన్మ భూమి ప్రాంతంలో అయోధ్య రామాలయం అత్యంత సుందరంగా ప్రపంచ వింతలలో ఒక అద్భుతంగా తీర్చి దిద్దుతున్న పరిస్థితులలో రాముడు గురించి అందరికీ మరింత ఎక్కువగా తెలియాలి అన్న ఆలోచనలతో ఈమూవీకి వినోదపన్ను రాయితీ ఇచ్చే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ చాలారోజులు తరువాత ఒక సినిమాకు విపరీతమైన మ్యానియా ఏర్పరుచుకున్న ఘనత ‘ఆదిపురుష్’ సొంతం చేసుకుంది..






RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి రాకముందు.. వెన్నెల కిషోర్ ఏం చేసేవాడో తెలుసా?

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>