Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec28f0461-b714-4c20-898e-0ba34e4c0dbf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec28f0461-b714-4c20-898e-0ba34e4c0dbf-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. జూన్ 9వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరికి నిశ్చితార్థం జరగబోతుందంటూ మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఇలా వీరిద్దరూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్త మెగా అభిమానులలో సంతోషాన్ని నింపింది. ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలియడంతో అభిమానులు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నsocialstars lifestyle{#}lavanya tripathi;prema;prince;varun sandesh;varun tej;Cinema;marriage;Love;News;June;Misterకాబోయే భర్త గూర్చి కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠీ....!!కాబోయే భర్త గూర్చి కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠీ....!!socialstars lifestyle{#}lavanya tripathi;prema;prince;varun sandesh;varun tej;Cinema;marriage;Love;News;June;MisterFri, 09 Jun 2023 07:40:00 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. జూన్ 9వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరికి నిశ్చితార్థం  జరగబోతుందంటూ మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది.ఇలా వీరిద్దరూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్త మెగా అభిమానులలో సంతోషాన్ని నింపింది. ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలియడంతో అభిమానులు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త అధికారకంగా ప్రకటించడంతో వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నటించిన మిస్టర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో భాగంగా ఈమె వరుణ్ తేజ్ హైట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.వరుణ్ తేజ్ ఆరడుగుల అందగాడు అనే విషయం మనకు తెలిసిందే. అయితే యాంకర్ ప్రశ్నిస్తూ మీరు ఇంత హైట్ ఉన్నారు కదా మీ పక్కన లావణ్య కొన్ని సీన్స్ చేయడానికి ఎలా కష్టపడ్డారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లావణ్య త్రిపాఠి సమాధానం చెబుతూ నేను వరుణ్ గారి పక్కన నిలబడి కొన్ని సన్నివేశాలలో నటించాలి అంటే కింద బాక్సులు వేసుకొని నటించాల్సి వచ్చిందంటూ వరుణ్ తేజ్ హైట్ గురించి లావణ్య త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ శీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమా ద్వారా వీరిద్దరూ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ ఇలా పెళ్లి బంధం వైపు అడుగులు వేసేలా చేసిందని తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

విమానం సినిమాకి నెటిజన్స్ ఇస్తున్న రేటింగ్ ఎంతో తెలుసా....!!

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>