Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sidharth024d3b1a-e3bc-45a2-b207-598f75540099-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sidharth024d3b1a-e3bc-45a2-b207-598f75540099-415x250-IndiaHerald.jpgసినిమా హీరోలు ఏం చేసినా.. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అలాంటిది ఎప్పుడూ నవ్వుతూ ఉండే హీరోలు కంటతడి పెట్టుకుంటే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అలాంటిది చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడిస్తే.. అభిమానులు కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. చాలా రోజుల తర్వాత టక్కర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు సిద్ధార్థ్. ఈ సినిమా నేడు విడుదల అయింది అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైనSidharth{#}Google;sujatha;Siddharth;shankar;Hero;Telugu;Director;Cinemaపెద్దావిడని చూసి బోరున ఏడ్చిన సిద్ధార్థ్.. ఇంతకీ ఆమె ఎవరంటే?పెద్దావిడని చూసి బోరున ఏడ్చిన సిద్ధార్థ్.. ఇంతకీ ఆమె ఎవరంటే?Sidharth{#}Google;sujatha;Siddharth;shankar;Hero;Telugu;Director;CinemaFri, 09 Jun 2023 10:45:00 GMTసినిమా హీరోలు ఏం చేసినా.. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అలాంటిది ఎప్పుడూ నవ్వుతూ ఉండే హీరోలు కంటతడి పెట్టుకుంటే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అలాంటిది చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడిస్తే.. అభిమానులు కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. చాలా రోజుల తర్వాత టక్కర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు సిద్ధార్థ్. ఈ సినిమా నేడు విడుదల అయింది అని చెప్పాలి.


 ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ కూడా అభిమానుల్లో సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాల పెంచాయి. అయితే ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నాడు సిద్ధార్థ్. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఒక పెద్దావిడను చూసి  ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే లేచి ఏకంగా ఆమె కాళ్లపై పడ్డాడు. అంతేకాదు చిన్నపిల్లడి లాగా వెక్కివెక్కి ఏడ్చాడు అని చెప్పాలి. దీంతో సిద్ధార్థ్ ఇలా చేశాడేంటి అని అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ సిద్ధార్థ్ ను కలవడానికి వచ్చిన ఆ పెద్దామెడ ఎవరు? ఆమెను చూడగానే ఎందుకు సిద్ధార్థ్ అంత ఎమోషనల్ అయ్యాడు అని గూగుల్ వేదికగా వెతికేస్తున్నారు అందరూ.


 ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని సిద్ధార్థ్ బాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే బాయ్స్ సినిమాలో సిద్ధార్థ్ ని తీసుకోవాలని డైరెక్టర్ శంకర్కు సూచించింది సుజాత రంగరాజనేనట. ఆరోజు ఆమె రికమెండ్ చేయకపోతే ఈరోజు నా జీవితం ఇలా ఉండేది కాదని.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆమె కారణం అంటూ ఎమోషనల్ అయ్యాడు సిద్ధార్థ్. అయితే హీరో సిద్ధార్థ్ ను బాయ్స్ సినిమా కోసం ఫోటోషూట్ కి వెళ్ళమంటే ఆయన వెళ్ళను అన్నారట. ఆ సమయంలో సుజాత రంగరాజన్ ఇక  బలవంతపెట్టి పంపించగా.. సినిమాలో సెలెక్ట్ అయ్యారు. అంతేకాదు సిద్ధార్థ్ లో ఉన్న మల్టీ టాలెంట్ ని కూడా సుజాత రంగరాజనే ప్రోత్సహించారట.



RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి రాకముందు.. వెన్నెల కిషోర్ ఏం చేసేవాడో తెలుసా?

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>