MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf2dee64b-ba22-4421-ab42-57a7d4f37bda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf2dee64b-ba22-4421-ab42-57a7d4f37bda-415x250-IndiaHerald.jpg ప్రపంచవ్యాప్తంగా బైబుల్ తరువాత ప్రపంచంలోని అన్ని భాషలలోకి అనువదింపబడ్డ ఏకైక కావ్యం రామాయణం. రష్యా చైనా లాంటి దేశాలలో కూడ అక్కడి ప్రజలకు రామాయణ గాథ తెలుసు. ఇక తెలుగువారి విషయానికి వస్తే ఏమాత్రం చదువుకొని నిరక్ష్య రాశ్యుడుకి కూడ రామాయణ కథ తెలుసు. భారతదేశంలో రామాలయం లేని చిన్న పల్లెటూరు కూడ ఉండదు అంటే అతిశయోక్తి కాదు.ఇలాంటి పరిస్థితులలో వచ్చేవారం విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ ఫలితం గురించి అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. కలర్ టివిలు వచ్చిన కొత్తలో రామానంద్ సాగర్ తీసిన ‘రామాయణం’ టివి సీరియలprabhas{#}Russia;Variar;Athadu;Manam;Cinemaఆదిపురుష్ లోని విషయాల పై గందరగోళం !ఆదిపురుష్ లోని విషయాల పై గందరగోళం !prabhas{#}Russia;Variar;Athadu;Manam;CinemaFri, 09 Jun 2023 09:00:00 GMT
ప్రపంచవ్యాప్తంగా బైబుల్ తరువాత ప్రపంచంలోని అన్ని భాషలలోకి అనువదింపబడ్డ ఏకైక కావ్యం రామాయణం. రష్యా చైనా లాంటి దేశాలలో కూడ అక్కడి ప్రజలకు రామాయణ గాథ తెలుసు. ఇక తెలుగువారి విషయానికి  వస్తే ఏమాత్రం చదువుకొని నిరక్ష్య రాశ్యుడుకి కూడ రామాయణ కథ తెలుసు. భారతదేశంలో రామాలయం లేని చిన్న పల్లెటూరు కూడ ఉండదు అంటే అతిశయోక్తి కాదు.



ఇలాంటి పరిస్థితులలో వచ్చేవారం  విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ ఫలితం గురించి అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. కలర్ టివిలు వచ్చిన కొత్తలో రామానంద్ సాగర్ తీసిన ‘రామాయణం’ టివి సీరియల్ ఎలాంటి సంచలనం సృష్టించిందో ఈనాటి తరం వాళ్లకి తెలియకపోయినా ఆతరం వాళ్లకి చాలామందికి తెలుసు. అంత ప్రాచూర్యం పొంది అందరికీ తెలిసిన కధను అందరికీ నచ్చేలా తీయాలి అంటే చాల సమర్థత ఓర్పు కావాలి.


అలాంటి లక్షణాలు ‘ఆదిపురుష్’ దర్శకుడుకు ఎంతవరకు ఉన్నాయి అన్న చర్చలు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారంమేరకు ‘ఆదిపురుష్’ మూవీలో రాఘవడు జానకి అన్న పేర్లతో ఆసినిమా కథను ఓం రౌత్ నడిపించాడు అన్నమాటలు వస్తున్నాయి.



వాస్తవానికి ఇప్పటి వరకు వచ్చిన రామాయణం సినిమాలలో శ్రీరామ చంద్రమూర్తి సీతమ్మ తల్లి అంటూ డైలాగ్స్ ఉన్నాయి కానీ రాఘవుడు జానకి అన్న పేర్లతో రామాయణం సినిమాలను మనం చూడలేదు. అంతేకాదు ఇప్పటివరకు జనం చూసిన రామాయణం సినిమాలలో కనిపించిన కథలు గాధలు  ‘ఆదిపురుష్’ మూవీలో కనిపించవు అంటున్నారు.



శ్రీముడు ని ఒక వారియర్ గా చూపెడుతూ అతడు రావణాసురుడు తో చేసిన యుద్ధకాండలోని ప్రధాన అంశాలను తీసుకుని దానికి కొత్త టెక్నలజీ జోడించి చేసిన ప్రయోగం ‘ఆదిపురుష్’ అంటున్నారు,  ఈమూవీకి ప్రస్తుతం ఏర్పడిన మ్యానియా రీత్యా మొదటి మూడు రోజులు కలక్షన్స్ విషయంలో ఇబ్బంది లేనప్పటికీ ఆతరువాత రోజులలో ఈ మూవీ ఎంతవరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అంటూ ఇండస్ట్రీలో అనేకమంది రకరకాల ఊహాగానాలు చేస్తూ ఈమూవీ కలక్షన్స్ ను అంచనాలు వేస్తున్నారు..








RRR Telugu Movie Review Rating

అమరావతి : కర్నాటక ఎన్నికలే కలిసొచ్చాయా ?

జగన్‌: సొంత జిల్లాలో ఆ పని చేయలేరా?

ఆది పురుష్‌: మత విద్వేషం రెచ్చగొడుతున్నారా?

జగన్‌ కీలక నిర్ణయం: వాళ్లంతా ఫుల్‌ హ్యాపీస్‌?

చేసింది చెప్పుకుంటే.. జగన్‌కు తిరుగులేదా?

ఎలక్షన్‌ స్పెషల్‌: ఆ వర్గాలపై జగన్‌ వరాల జల్లు?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>