Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec1c99994-c0d1-4d2b-a35d-1eb57c505f89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec1c99994-c0d1-4d2b-a35d-1eb57c505f89-415x250-IndiaHerald.jpgఆర్ఆర్ఆర్ చిత్రం తో గ్లోబల్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన తదుపరి చిత్రం గా కొరటాల శివ తో 'దేవర' అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కొద్దిరోజుల క్రితమే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు, అందులో 'దేవర'అనే పాత్రకి సంబంధించిన లుక్ ని మొన్న మనం చూసాము. రెండవ పాత్రకి సంబంధించిన లుక్ విడుదల కావాల్సి ఉంది. ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ socialstars lifestyle{#}NTR;Aly Khan;Sridevi Kapoor;koratala siva;bollywood;Hollywood;Audience;Traffic police;Indian;Manam;Chitram;Success;Heroine;Telugu;Industry;Hero;Cinemaఎన్టీఆర్ ని నమ్మించి మోసం చేసే పాత్రలో జాన్వీ కపూర్....!!ఎన్టీఆర్ ని నమ్మించి మోసం చేసే పాత్రలో జాన్వీ కపూర్....!!socialstars lifestyle{#}NTR;Aly Khan;Sridevi Kapoor;koratala siva;bollywood;Hollywood;Audience;Traffic police;Indian;Manam;Chitram;Success;Heroine;Telugu;Industry;Hero;CinemaThu, 08 Jun 2023 06:52:47 GMTఆర్ఆర్ఆర్ చిత్రం తో గ్లోబల్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన తదుపరి చిత్రం గా కొరటాల శివ తో 'దేవర' అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కొద్దిరోజుల క్రితమే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు, అందులో 'దేవర'అనే పాత్రకి సంబంధించిన లుక్ ని మొన్న మనం చూసాము. రెండవ పాత్రకి సంబంధించిన లుక్ విడుదల కావాల్సి ఉంది. ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఈ మూవీ స్క్రిప్ట్ పై కొరటాల శివ ఎంతో శ్రద్ద పెట్టి పని చేసాడు. సుమారుగా ఏడాది పాటు కూర్చొని స్క్రిప్ట్ పై రీ వర్క్ చేసి ప్రాంతీయ బాషా చిత్రాన్ని కాస్త పాన్ ఇండియన్ ఇండియన్ చిత్రం గా మలిచాడు.

అంతే కాదు ఈ సినిమా కోసం పాన్ హాలీవుడ్ టెక్నిషియన్స్ ని రప్పించాడు, వాళ్ళ చేత భారీ సెట్స్ కూడా వేయించాడు. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె జాలరి పాత్రలో, ప్రముఖ హీరో శ్రీకాంత్ కూతురిగా కనిపించబోతుంది. ఇక ఈ చిత్రం లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ చిత్రం లో జాన్వీ కపూర్ పాత్ర ఇచ్చే ట్విస్టులకు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుందట. ఈమె ఇందులో జాలరి పాత్ర పోషిస్తుంది, ఎంతో అమాయకంగా కనిపించే ఈమె ఇంటర్వెల్ లో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది తెలుస్తుంది.సముద్ర నిధులను అక్రమంగా దోచుకొని స్మగుల్ చేసే ఎన్టీఆర్ రహస్యాలను తెలుసుకునేందుకు , అతనికి బాగా దగ్గరై, అతనిని ప్రేమించినట్టు మోసం చేసి , ఇంటర్వెల్ లో పెద్ద ట్విస్టు ఇస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను ఆమె నాలుగు కోట్ల రూపాయిలు పారితోషికంగా తీసుకుంటుందట. బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ కి, ఒక్క సక్సెస్ కూడా రాలేదు.ఐరన్ లెగ్ గా ముద్ర తెచ్చుకున్న జాన్వీ కపూర్ కి ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం జాన్వీ కపూర్ దశ తిరిగినట్టే,సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఎలేస్తుందని చెప్పొచ్చు. తెలుగు లో తోలి సినిమాతోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ తో చెయ్యడం, పైగా చాలెంజింగ్ రోల్ దక్కడం జాన్వీ కపూర్ అదృష్టం అనే చెప్పాలి. ఒక్క సక్సెస్ కూడా లేకపోయినప్పటికీ ఈమెకు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె అందానికి ముగ్దులై కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతుంటారు. ఇక ఈమెకి కమర్షియల్ సక్సెస్ వస్తే మాత్రం ఈమె రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.



RRR Telugu Movie Review Rating

నెటిజన్ చేత అలా అనిపించుకున్నా యాంకర్ రవి....!!

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>