Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb7f75ba-4c9f-4432-bf23-d92cf23fc11a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebb7f75ba-4c9f-4432-bf23-d92cf23fc11a-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన అమితాబ్ ప్రస్తుతం పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన గురించి తాజాగా ఒక వార్త సోsocialstars lifestyle{#}Amitabh Bachchan;sunday;Audience;Cinemaఅభిమానుల కోసం అలాంటి పని చేస్తున్న బిగ్ బీ ...!!అభిమానుల కోసం అలాంటి పని చేస్తున్న బిగ్ బీ ...!!socialstars lifestyle{#}Amitabh Bachchan;sunday;Audience;CinemaThu, 08 Jun 2023 07:20:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు అమితాబ్ బచ్చన్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన అమితాబ్ ప్రస్తుతం పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తమ అభిమాన హీరోలను చూడటం కోసం అభిమానులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వారి అభిమాన హీరోల ఇంటిముందు ఎంతోమంది అభిమానులు పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇలా అమితాబ్ ఇంటి ముందు కూడా ఎంతోమంది తనని చూడడం కోసం వేచి చూస్తూ ఉంటారు.అయితే తన కోసం ఎదురుచూస్తున్నటువంటి అభిమానుల కోసం అమితాబ్ గత 50 సంవత్సరాలుగా ఈ పని చేస్తూనే వస్తున్నారంటూ వార్త వైరల్ గా మారింది.ప్రతి ఆదివారం ఉదయం జల్సాలో ఉన్నటువంటి తన ఇంటి బాల్కనీలో అభిమానుల కోసం ఈయన కొంత సమయం కేటాయిస్తారని సమాచారం. కొంత సమయం పాటు ఈ బాల్కనీలో నిలబడి అభిమానులకు కనిపించడమే కాకుండా వారితో సరదాగా కాసేపు మాట్లాడతారని తెలుస్తోంది.ఇక కొన్నిసార్లు ఈయన కనుక ముంబైలో లేకపోతే తాను ముంబైలో లేను అనే విషయాన్ని రెండు రోజులు ముందే తెలియచేస్తారట. అయితే అమితాబ్ ఇలా గత 50 సంవత్సరాలుగా ఆదివారం అభిమానుల కోసం కొంత సమయం కేటాయించడం చేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే అభిమానులను కలిసే ఈ సమయంలో అమితాబ్ కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా వారిని కలుస్తారట.మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదులుతాం అయితే ఈయన దృష్టిలో అభిమానులు ప్రేక్షకులు కూడా దేవుళ్ళు కావడంతో తన ప్రేక్షక దేవుళ్లను కలిసే సమయంలో చెప్పులు లేకుండా కలుస్తారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ విషయం లో భర్తనే మించిపోయిన నమ్రత..!?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>