LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/periyed-noopi-thaginchukovadniki-ee-chitkalu-pateste-chalu8cf8abeb-2eaf-4223-8b5d-1709cce42ec2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/periyed-noopi-thaginchukovadniki-ee-chitkalu-pateste-chalu8cf8abeb-2eaf-4223-8b5d-1709cce42ec2-415x250-IndiaHerald.jpgస్త్రీల జీవితంలో పీరియడ్స్ అనేవి సర్వసాధారణం.కానీ కొంతమందికి పీరియడ్స్ వస్తే చాలు విపరీతమైన పొట్టనొప్పి,పాదాలు,నడుము,కండరాలు నొప్పి మరియు అధిక రక్తస్రావం అవడం మొదలవుతుంది.దీనితో పీరియడ్స్ అంటేనే చాలామంది స్త్రీలు భయపడుతూ ఉంటారు. ఇంకొంతమంది స్త్రీలలో అసలు పీరియడ్ ఎప్పుడు వచ్చిందో,ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది.అలాంటి స్త్రీలకు ఏ బాధ లేదు కానీ,పొట్ట నొప్పి,అధిక రక్తస్రావంతో,నిద్రలేమితో బాధపడే స్త్రీలకు మాత్రం కొన్ని చిట్కాలు పాటిస్తే వాటి నుంచి నివారణ కలుగుతుందని వైPAIN{#}Ginger;Coffeeపీరియడ్స్ నొప్పి తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు..!పీరియడ్స్ నొప్పి తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు..!PAIN{#}Ginger;CoffeeThu, 08 Jun 2023 19:00:00 GMTస్త్రీల జీవితంలో పీరియడ్స్ అనేవి సర్వసాధారణం.కానీ కొంతమందికి పీరియడ్స్ వస్తే చాలు విపరీతమైన పొట్టనొప్పి,పాదాలు,నడుము,కండరాలు నొప్పి మరియు అధిక రక్తస్రావం అవడం మొదలవుతుంది.దీనితో పీరియడ్స్ అంటేనే చాలామంది స్త్రీలు భయపడుతూ ఉంటారు. ఇంకొంతమంది స్త్రీలలో అసలు పీరియడ్ ఎప్పుడు వచ్చిందో,ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది.అలాంటి స్త్రీలకు ఏ బాధ లేదు కానీ,పొట్ట నొప్పి,అధిక రక్తస్రావంతో,నిద్రలేమితో బాధపడే స్త్రీలకు మాత్రం కొన్ని చిట్కాలు పాటిస్తే వాటి నుంచి నివారణ కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

గోరువెచ్చని నీటితో స్నానం..

పీరియడ్ సమయంలో రోజుకు ఒకటికి రెండు సార్లు గోరవెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల,రిప్రెష్మెంట్ కలగడమే కాకుండా కండరాలు ఉత్తేజమై,నొప్పులన్నీ తగ్గిపోతాయి.మరియు ఋతుస్తావం అవడంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి.కావున స్త్రీలు పిరియడ్ సమయంలో రోజుకి రెండుసార్లు స్నానం చేయడం చాలా మంచిది.

 కాఫీ,టీ కి దూరంగా ఉండడం..

పీరియడ్ సమయంలో చాలా మంది ఒత్తిడికి భరించలేక, కాఫీ,టీ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.కానీ ఇందులోని కెఫెన్ ఒత్తిడిని పెంచడమే కాకుండా,అధిక రక్తస్రావం అయ్యేందుకు దోహదం చేస్తుంది.కనుక కాఫీ టీలకు దూరంగా ఉండడం చాలా మంచిది.



అల్లం పెప్పర్ టీ..

కొంతమంది ఉదయం లేవగానే కాఫీ,టీలు లేకపోతే వారికి రోజు గడవదని చెప్పవచ్చు.అలాంటి వారు పీరియడ్ సమయంలో అల్లం పెప్పర్ టీ తీసుకోవడంతో ఒత్తిడిని తగ్గించడమే కాకుండా,నడుము నొప్పి,పొట్టనొప్పి నుంచి నివారణ కలిగిస్తుంది.మరియు రక్తస్రావాన్ని కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

ధ్యానం చేయడం..

చాలామందికి పీరియడ్ సమయంలో పనిలో ఒత్తిడి మరియు ఆరోగ్యపరంగా సమస్యలతో చాలా విసిగిపోతూ ఉంటారు.అలాంటివారు తమకి తాము ఒక అరగంట సేపు సమయం కేటాయించుకుని ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది.

పడకగది చల్లగా ఉంచుకోవడం..

చాలామందికి పీరియడ్స్ సమయంలో సరైన నిద్ర కూడా కరువైపోతూ ఉంటుంది.అలాంటి వారు తమ పడకగదిని చల్లగా ఉంచుకోవడం వల్ల,సక్రమంగా నిద్ర పట్టి,అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.



RRR Telugu Movie Review Rating

గంగోత్రి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>