MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2f3de1c2-ab06-43c1-acbe-9a8483a332f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2f3de1c2-ab06-43c1-acbe-9a8483a332f6-415x250-IndiaHerald.jpgతెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సంక్రాంతి సీజన్ తరువాత సమ్మర్ సీజన్ ఆతరువాత కొంత గ్యాప్ తో వచ్చే దసరా సీజన్ లో చాల కీలకమైనవి. అందువల్లనే భారీ సినిమాలు అన్నీ ఈ సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సంవత్సరం సమ్మర్ సీజన్ చాల డల్ గా నడిచింది అన్న వార్తలు కూడ వినిపించాయి.దీనితో ఈనెల విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీకి అన్ని పరిస్థితులు కలిసి వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఈ మూవీ తరువాత ఆగష్టులో చిరంజీవి ‘భోళాశంకర్’ మూవtollywood{#}Dussehra;Makar Sakranti;Yevaru;politics;Vijayadashami;Joseph Vijay;producer;Producer;ram pothineni;Balakrishna;Industry;Ravi;Chiranjeevi;News;Tollywood;Cinemaదసరా వార్ లో రాజకీయం !దసరా వార్ లో రాజకీయం !tollywood{#}Dussehra;Makar Sakranti;Yevaru;politics;Vijayadashami;Joseph Vijay;producer;Producer;ram pothineni;Balakrishna;Industry;Ravi;Chiranjeevi;News;Tollywood;CinemaThu, 08 Jun 2023 13:38:37 GMTతెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సంక్రాంతి సీజన్ తరువాత సమ్మర్ సీజన్ ఆతరువాత కొంత గ్యాప్ తో వచ్చే దసరా సీజన్ లో చాల కీలకమైనవి. అందువల్లనే భారీ సినిమాలు అన్నీ ఈ సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సంవత్సరం సమ్మర్ సీజన్ చాల డల్ గా నడిచింది అన్న వార్తలు కూడ వినిపించాయి.


దీనితో ఈనెల విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీకి అన్ని పరిస్థితులు కలిసి వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఈ మూవీ తరువాత ఆగష్టులో చిరంజీవి ‘భోళాశంకర్’ మూవీ ఉన్నప్పటికీ దసరా రేస్ మాత్రమే పెద్దదిగా కనిపిస్తున్న నేపధ్యంలో ఈ రేస్ ను టార్గెట్ చేస్తూ బాలకృష్ణ అనీల్ రావిపూడి ల మూవీతో పాటు రవితేజా ‘టైగర్ నాగేశ్వరావు’ రామ్ బోయపాటిల మూవీ కూడ దసరా రేస్ కు రాబోతోంది.


అయితే ఎవరు ఊహించని విధంగా ఈ దసరా కు మళ్ళీ డబ్బింగ్ సినిమా తలపోటు ఎదురౌతోంది. విజయ్ నటించిన ‘లియో’ మూవీ కూడ దసరా రేస్ కు సిద్ధపడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈ సినిమా డబ్భింగ్ రైట్స్ ను ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కొనడంతో దసరా సీజన్ కు సినిమాలకు మళ్ళీ ధియేటర్ల సమస్య ఏర్పడుతుంది.

ఇప్పటి నుంచే ఆ ప్రముఖ నిర్మాత తన సినిమాకు ధియేటర్ల సమస్య లేకుండా ముందు  నుంచే అడ్వాన్స్ లు ఇచ్చి ధియేటర్లు బ్లాక్ చేసే ఆలోచనలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి కూడ ఇదే పరిస్థితి ఎదురైంది. బాలకృష్ణ చిరంజీవిల సినిమాలాతో పాటు విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా పోటీగా విడుదల అవ్వడంతో ధియేటర్ల కోసం అనేక రాజకీయాలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ దసరా కు రిపీట్ అవుతుందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి..






RRR Telugu Movie Review Rating

ఆ విషయం లో భర్తనే మించిపోయిన నమ్రత..!?

రష్యాకి ఆ దేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు?

కాశ్మీర్‌ అల్లకల్లోలానికి పాక్‌ కుట్ర?

ఉక్రెయిన్‌: యుద్ధ సమయంలోనూ ఇంటి గొడవలు?

మోదీని దించేందుకు అంతర్జాతీయ కుట్ర?

టీడీపీ: కోడెలకు నిజంగా అన్యాయం చేసిందెవరు?

తెలుగు ఛానళ్లలో నెంబర్‌ వన్‌ గోల?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>