Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralef0d8a55-c0cc-4e59-8405-c3c9c3c4d388-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralef0d8a55-c0cc-4e59-8405-c3c9c3c4d388-415x250-IndiaHerald.jpgఢిల్లీలో ఉండే ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మెట్రోని కొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా వాడుకుంటున్న తీరు మాత్రం ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. దీంతో ఢిల్లీ మెట్రో గత కొంతకాలం నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎంతో మంది సోషల్ మీడియాలో ఫాలోవర్లను ఆకట్టుకునేందుకు చిత్ర విచిత్రమైన వేషధారణలతో అటు మెట్రో రైల్లో ప్రయాణించడం లాంటి వీడియోలు వైరల్ గా మారిపోయాయి. మొన్నటికి మొన్న ఏకంగా ఇద్దరు లవర్స్ మెట్రోలోనే అందరి ముందు రొమాన్స్ తో రెచ్చిపోయViral{#}Delhiవైరల్ : మెట్రోలో.. దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు?వైరల్ : మెట్రోలో.. దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు?Viral{#}DelhiWed, 07 Jun 2023 14:00:00 GMTఢిల్లీలో ఉండే ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మెట్రోని కొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా వాడుకుంటున్న తీరు మాత్రం ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. దీంతో ఢిల్లీ మెట్రో గత కొంతకాలం నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎంతో మంది సోషల్ మీడియాలో  ఫాలోవర్లను ఆకట్టుకునేందుకు చిత్ర విచిత్రమైన వేషధారణలతో అటు మెట్రో రైల్లో ప్రయాణించడం లాంటి వీడియోలు వైరల్ గా మారిపోయాయి. మొన్నటికి మొన్న ఏకంగా ఇద్దరు లవర్స్ మెట్రోలోనే అందరి ముందు రొమాన్స్ తో రెచ్చిపోయారు.


 ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మెట్రో మరో విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఒకరిని ఒకరు తన్నుకునేంతవరకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అక్కడ ఏం జరిగిందో.. కానీ ఒక యువతి బూటుతో మరో యువతిని బెదిరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన మరో యువతీ ఏకంగా తన చేతిలో ఉన్న వాటర్ ప్లాస్క్కుతో మరో యువతిపై దాడికి దిగింది.



 ఏకంగా వాటర్ ప్లాస్క్ లో ఉన్న నీటిని ఇలా ఆ యువతిపై పోసింది. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో.. తోటి ప్రయాణికులు కల్పించుకొని ఆ ఇద్దరినీ శాంతింప చేయడానికి ప్రయత్నించిన ఇక గొడవ మాత్రం సద్దుమనగలేదు. ఏకంగా రెచ్చిపోయి ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకున్నారు. ఇక వెంటనే తోటి ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేశారు అని చెప్పాలి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇక ఎంతోమంది నెటిజెన్స్ స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ మెట్రో ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్  గా మారిందని తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారని తెలియడం లేదా అంటూ ఫైర్ అవుతున్నారు నేటిజన్స్.
">



RRR Telugu Movie Review Rating

అర్జున్ రెడ్డి వదులుకున్నందుకు.. ఆ హీరో ఇప్పటికి బాధపడుతున్నాడట?

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?

ఒడిశా రైలు ప్రమాదం వెనుక భయంకర కుట్ర?

అమిత్‌షాతో భేటీ తర్వాత బాబు మౌనం.. ఇందుకేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>