Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-44f7602a-f26a-4da0-b7a4-0dc8a1313e22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-44f7602a-f26a-4da0-b7a4-0dc8a1313e22-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమ లో తక్కువ సినిమాలే చేసినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో తిరువీర్ ఒకరు. రంగస్థల నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన తిరువీర్ నటుడిగా అలాగే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను సొంతం చేసుకోవడం విశేషం. తిరువీర్ మసూద సినిమా లో తన నటనతో ప్రేక్షకులకు మరింత గా దగ్గరయ్యారు. పరేషాన్ సినిమాతో తిరువీర్ మరో సక్సెస్ ను ఖాతా లో వేసుకున్నారనే విషయం తెలిసిందే. తిరువీర్ పలు బోల్డ్ సినిమాల లో కూడా నటించారు. ప్రస్తుతం ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు కీలక పాత్రల్లో నటిస్తూ తిరువీర్ Socialstars lifestyle {#}prema;Love;Car;Film Industry;Father;George Reddy;media;Success;Cinemaవరుస విజయాలతో దూసుకుపోతున్న తిరువీర్...!!వరుస విజయాలతో దూసుకుపోతున్న తిరువీర్...!!Socialstars lifestyle {#}prema;Love;Car;Film Industry;Father;George Reddy;media;Success;CinemaWed, 07 Jun 2023 23:22:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమ లో తక్కువ సినిమాలే చేసినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో తిరువీర్ ఒకరు. రంగస్థల నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన తిరువీర్ నటుడిగా అలాగే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను సొంతం చేసుకోవడం విశేషం.

తిరువీర్ మసూద సినిమా లో తన నటనతో ప్రేక్షకులకు మరింత గా దగ్గరయ్యారు. పరేషాన్ సినిమాతో తిరువీర్ మరో సక్సెస్ ను ఖాతా లో వేసుకున్నారనే విషయం తెలిసిందే. 

తిరువీర్ పలు బోల్డ్ సినిమాల లో కూడా నటించారు. ప్రస్తుతం ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు కీలక పాత్రల్లో నటిస్తూ తిరువీర్ తన సత్తా చాటుతున్నారు. పలాస మరియు జార్జ్ రెడ్డి సినిమాల విజయాల తో తిరువీర్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తిరువీర్ నాటక రంగ గురువు పేరు రఘువీర్ కాగా ఆయన పేరు నుంచి వీర్ తీసుకుని తిరుపతిరెడ్డి అనే పేరును ఈ నటుడు తిరువీర్ గా మార్చుకోవడం విశేషం.తాజాగా తిరువీర్ కొత్త కారు ను కూడా కొనుగోలు చేశారు. సోషల్ మీడియా వేదికగా తిరువీర్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను తిరువీర్ షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. "ఇక యెండ వానల వల్ల పరేషాన్ లేదు. ఫ్యామిలీ లోకి కొత్త పిల్లగాడు వచ్చిండు, ఎల్కం. మీ ప్రేమ వల్లనే ఇదంతా మస్త్ ఖుషీగా ఉంది!!!" అని తిరువీర్ తన పోస్ట్ లో పేర్కొన్నట్లు సమాచారం.

పారిశ్రామిక సంస్థ లో తిరువీర్ తండ్రి పని చేయగా పుస్తకాలు కొనుక్కోవడం కోసం తిరువీర్ కూడా పనికి వెళ్లేవారు. ఎంతో కష్టపడి తిరువీర్ ఈ స్థాయికి చేరుకోవడం విశేషం.. వరుస విజయాలతో తిరువీర్ రెమ్యునరేషన్ కూడా పెరుగుతోందని తెలుస్తోంది. తిరువీర్ కు పాపులారిటీ అంతకంతకూ బాగా పెరుగుతోంది. తిరువీర్ కు సోషల్ మీడియాలో కూడా క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం విశేషం.



RRR Telugu Movie Review Rating

వరుస విజయాలతో దూసుకుపోతున్న తిరువీర్...!!

ఇండియాను తెగ మెచ్చుకుంటున్న అమెరికా?

వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>