EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/vijayasai-reddyc9f8405c-77bd-4987-9cf8-9e24b6b7271d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/vijayasai-reddyc9f8405c-77bd-4987-9cf8-9e24b6b7271d-415x250-IndiaHerald.jpgవైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. 2024 గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైయ‌స్ఆర్‌సీపీ గెలుపు కోసం అనుబంధ విభాగాలు ఎలా పని చేశాయో...అలాగే 2024 గెలుపు కోసం సమ‌ష్టిగా పనిచేయాలని విజయసాయి రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనుబంధ విభాగాలలో ఖాళీగా ఉన్న పదవులను త్వరితగతిన భర్తీ చెయ్యాలని విజయసాయి రెడ్డి సూచించారు. గతంలో పార్డీ నVIJAYASAI REDDY{#}V Vijayasai Reddy;Scheduled Tribes;Backward Classes;Tadepalli;Hanu Raghavapudi;YCP;District;central government;Government;Reddy;Partyవైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?వైసీపీ గెలుపు కోసం విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌?VIJAYASAI REDDY{#}V Vijayasai Reddy;Scheduled Tribes;Backward Classes;Tadepalli;Hanu Raghavapudi;YCP;District;central government;Government;Reddy;PartyWed, 07 Jun 2023 07:13:34 GMTవైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. 2024 గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైయ‌స్ఆర్‌సీపీ గెలుపు కోసం అనుబంధ విభాగాలు ఎలా పని చేశాయో...అలాగే 2024 గెలుపు కోసం సమ‌ష్టిగా పనిచేయాలని విజయసాయి రెడ్డి కార్యకర్తలకు  పిలుపునిచ్చారు.. వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో  తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో  సమావేశం నిర్వహించారు.


అనుబంధ విభాగాలలో ఖాళీగా ఉన్న పదవులను  త్వరితగతిన  భర్తీ చెయ్యాలని విజయసాయి రెడ్డి సూచించారు. గతంలో పార్డీ నిర్వహించిన జయహో బీసీ సమావేశం మాదిరిగా ఎస్సీ,ఎస్టీ, ముస్లిం మైనారిటీ సమావేశాలు రాష్ట్ర స్ధాయీలో నిర్వహించాలని విజయసాయి రెడ్డి చెప్పారు. అనేక సామాజిక వర్గాలకు, విభాగాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు, కార్యక్రమాలపై ప్రచారం పెంచాలన్నారు.


దీనిపై ఇంటింటికీ ప్రచారం ఎలా చెయ్యాలి అన్నదాని మీద విజయసాయి రెడ్డి పార్టీ నేతలతో చర్చించారు. అనుబంధ విభాగాల అధ్యక్షులకు అధనంగా మరికొంత మందిని నియామించే అంశంపైనా విజయసాయి రెడ్డి చర్చించారు. దీనిపై  సాధ్యాసాధ్యాలపై విజయసాయి రెడ్డిఈ సమావేశంలో చర్చలు జరిపారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు గెలుపు కోసం అనుబంధ విభాగాలు పార్టీ కోసం ఎలా పని చేశాయో విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.


అదే తరహాలో మరోసారి 2024 గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. త్వరగా పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇంచార్జీలు, జిల్లా ప్రెసిడెంట్స్, మండల ఇంచార్జిల ఖాళీలను ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో  సమన్వయం చేసుకోవాలన్నారు. జయహో బిసి మహాసభ తరహాలో త్వరలో పార్టీ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ,ముస్లిం మైనారిటీ, మహాసభలు విజయవంతం చేయాలన్నారు. ఏమైనా సమస్యలుంటే అనుబంధ విభాగాల అధ్యక్షులు తన దృష్టికి తీసుకురావాలని విజయసాయి రెడ్డి  పార్టీ నేతలను కోరారు. మొత్తం మీద కొన్నాళ్లుగా పార్టీలో కనిపించని విజయసాయి రెడ్డి మరోసారి యాక్టివ్‌ అయ్యారు.



RRR Telugu Movie Review Rating

అల్లుఅర్జున్ - స్నేహారెడ్డి మద్యలో ఒక ఒప్పంద పత్రానికి కారణం .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>