Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee57fe52d-9d13-42ef-b501-a5877a122cad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee57fe52d-9d13-42ef-b501-a5877a122cad-415x250-IndiaHerald.jpgబుల్లితెర మీద అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న కామెడీ షోస్ లో ఒక్కటి 'జబర్దస్త్'. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ కామెడీ షో, ఇప్పటికీ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతూనే ఉంది. ఈ షో ద్వారా పరిచయమైనా ఎంతో మంది కమెడియన్స్ నేడు, స్టార్ కమెడియన్స్ గా మరియు హీరోలు గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. వారిలో మనం ప్రధానం గా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్ గురించి. ఇతను ఇండస్ట్రీ లోకి రాకముందు ఎన్ని కష్టాలను అనుభవించాడో ఆయన మాటల్లోనే ఎన్నో సార్లు విన్నాము. ఆకలి తో కడుపు నింపుకోవడానికి డబ్బsocialstars lifestyle{#}Mallemala Entertainments;Pawan Kalyan;Leader;Manam;sudigali sudheer;Jabardasth;Comedian;Comedy;media;Industry;AdiNarayanaReddy;Hero;Tollywood;Cinemaసుధీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ ఆర్టిస్ట్....!!సుధీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ ఆర్టిస్ట్....!!socialstars lifestyle{#}Mallemala Entertainments;Pawan Kalyan;Leader;Manam;sudigali sudheer;Jabardasth;Comedian;Comedy;media;Industry;AdiNarayanaReddy;Hero;Tollywood;CinemaTue, 06 Jun 2023 07:46:56 GMTబుల్లితెర మీద అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న కామెడీ షోస్ లో ఒక్కటి 'జబర్దస్త్'. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ కామెడీ షో, ఇప్పటికీ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతూనే ఉంది.

ఈ షో ద్వారా పరిచయమైనా ఎంతో మంది కమెడియన్స్ నేడు, స్టార్ కమెడియన్స్ గా మరియు హీరోలు గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. వారిలో మనం ప్రధానం గా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్ గురించి. ఇతను ఇండస్ట్రీ లోకి రాకముందు ఎన్ని కష్టాలను అనుభవించాడో ఆయన మాటల్లోనే ఎన్నో సార్లు విన్నాము. ఆకలి తో కడుపు నింపుకోవడానికి డబ్బులు లేక, ట్యాప్ నీళ్లు త్రాగి బ్రతికిన రోజులు కూడా ఉన్నాయి. తనకి తెలిసిన మ్యాజిక్ షోస్ ని చేసుకుంటూ, ఆ వచ్చిన డబ్బులతో జీవించే అతి సాధారణమైన మనిషి సుడిగాలి సుధీర్. అలాంటి సుధీర్ కి జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కింది.

అప్పటికే ఇండస్ట్రీ లో స్థిరపడి ఉన్న ప్రముఖ కమెడియన్ వేణు , జబర్దస్త్ లో కూడా కొంత కాలం పనిచేసాడు. ఆయన టీం లో స్కిట్స్ చేస్తూ వచ్చిన సుడిగాలి సుధీర్, ఆ తర్వాత టీం లీడర్ గా మారి ఎన్నో అద్భుతమైన స్కిట్స్ చేసి అతి తక్కువ సమయం లోనే ఒక మీడియం రేంజ్ హీరో కి ఉండాల్సింది ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని దక్కించుకున్నాడు. జబర్దస్త్ లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న తర్వాత సుడిగాలి సుధీర్ కి ఈటీవీ లో అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి. ఒకానొక దశలో ఆయన లేని ఎంటర్టైన్మెంట్ షో అనేదే ఉండేది కాదు. ఆ స్థాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అలా బుల్లితెర పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ ని నచ్చి, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కూడా ఆయనకి అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. అలా కమెడియన్ గా పలు సినిమాల్లో నటించిన సుడిగాలి సుధీర్, ఆ తర్వాత హీరో గా కూడా చెయ్యడం ప్రారంభించాడు. తొలి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, రీసెంట్ గా 'గాలోడు' మూవీ తో మంచి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా, సుడిగాలి సుధీర్ ఈటీవీ ఛానల్ ని వదిలి వెళ్లిపోయిన తర్వాత, హైపర్ ఆది ఆయన స్థానాన్ని ఆక్రమించుకొని నెంబర్ 1 స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే, అయితే ఆయన రీసెంట్ గా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ 'సుడిగాలి సుధీర్ వల్ల మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కి క్రేజ్ రాలేదు, సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యిందే మేము ఆయన మీద వేసే పంచుల ద్వారా, లేకపోతే ఈ స్థాయి లో ఉండేవాడు కాదు' అంటూ హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారింది.



RRR Telugu Movie Review Rating

"బ్రో" మూవీ కథను అంతలా మార్పులు చేశారా..?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>