MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg యంగ్ హీరోలలో నిఖిల్ అదృష్టం జెట్ స్పీడ్ తో పరుగులు తీస్తోంది. ‘కార్తికేయ 2’ ఘనవిజయం సాధించడంతో ఒక్కసారిగా నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయి బాలీవుడ్ లో కూడ తన మార్కెట్ పెంచుకున్నాడు. ఈమూవీ తరువాత అతడికి వస్తున్న సినిమా ఆఫర్లు అన్నీ పాన్ ఇండియా రేంజ్ లో ఉంటున్నాయిఈ మధ్యే రిలీజ్ అయిన ‘స్పై’ టీజర్ ను చూసిన వారు ఈమూవీ కూడ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇక రామ్ చరణ్ సొంత బ్యానర్ లో నిఖిల్ నటిస్తున్న ‘ది ఇండియా హౌస్’ కూడ మరో పాన్ ఇండియా మూవీగా మారడమే కాకుండాnikhil{#}Ram Charan Teja;Mani Ratnam;bharath;Sri Bharath;Writer;August;vegetable market;Variar;Darsakudu;ravi anchor;Director;bollywood;Cinema;Indiaఆశక్తి కలిగిస్తున్న నిఖిల్ స్వయంభు !ఆశక్తి కలిగిస్తున్న నిఖిల్ స్వయంభు !nikhil{#}Ram Charan Teja;Mani Ratnam;bharath;Sri Bharath;Writer;August;vegetable market;Variar;Darsakudu;ravi anchor;Director;bollywood;Cinema;IndiaTue, 06 Jun 2023 08:00:00 GMT
యంగ్ హీరోలలో నిఖిల్ అదృష్టం జెట్ స్పీడ్ తో పరుగులు తీస్తోంది. ‘కార్తికేయ 2’ ఘనవిజయం సాధించడంతో ఒక్కసారిగా నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయి బాలీవుడ్ లో కూడ తన మార్కెట్ పెంచుకున్నాడు. ఈమూవీ తరువాత అతడికి వస్తున్న సినిమా ఆఫర్లు అన్నీ పాన్ ఇండియా రేంజ్ లో ఉంటున్నాయి.

 

 ఈ మధ్యే రిలీజ్ అయిన ‘స్పై’ టీజర్ ను చూసిన వారు ఈమూవీ కూడ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇక రామ్ చరణ్ సొంత బ్యానర్ లో నిఖిల్ నటిస్తున్న ‘ది ఇండియా హౌస్’ కూడ మరో పాన్ ఇండియా మూవీగా మారడమే కాకుండా ఈమూవీ కూడ బ్లాక్ బష్టర్ హిట్ అయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు.

 

 
లేటెస్ట్ గా నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభు’ మూవీ ఫస్ట్ లుక్ పోష్టర్ చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు. చారిత్రక నేపథ్యంలో నిఖిల్‌ ను యుద్ధ వీరుడిగా చూపిస్తూ ఒక సినిమా తీస్తారని అతడి అభిమానులు కూడ ఊహించి ఉండరు. ఈమూవీ ద్వారా భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌ కు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఇతడు రచయితగా తమిళంలో కొన్ని సినిమాలకు పని చేశాడు.

 

 
చోళుల నేపథ్యంలో ఒక ఆసక్తికర వారియర్ స్టోరీ రెడీ చేసుకుని ఈసినిమాగా తీస్తున్నాడు. దీనితో ఈమూవీ పై మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ఛాయలు కనిపిస్తాయా అన్న సందేహాలు కూడ కొందరికి వస్తున్నాయి. ‘బింబిసార’ రచయిత వాసుదేవ్ సహకారంతో ఈసినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆగష్టు నుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీకి మనోజ్ పరమహంస రవి బస్రూర్ లాంటి టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా నిఖిల్ నుంచి రాబోతున్న ‘స్పై’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అయితే ఇక అతడి కెరియర్ కు తిరుగులేదు అన్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి..

 



RRR Telugu Movie Review Rating

"బ్రో" మూవీ కథను అంతలా మార్పులు చేశారా..?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>