Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/test1cf0cce2-47a6-49c8-89a0-5d42756e410e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/test1cf0cce2-47a6-49c8-89a0-5d42756e410e-415x250-IndiaHerald.jpgభారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెడీ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొందరు క్రీడా నిపుణులు టీమిండియాలో వున్న ఒక లోటును ఎత్తి చూపుతున్నారు. విషయం ఏమంటే, భారత బృందంలో సరైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేడు. ఆసీస్ జట్టు కామెరూన్ గ్రీన్ ఆ పాత్ర పోషిస్తున్నాడు. కానీ భారత్‌లో అలాంటి ప్లేయర్ లేకపోవడం ఇపుడు చర్చనీయాంశమైంది. హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా అతను టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా త్రిపుర క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా వచ్చిన లాన్స్ క్లూసెనర్ ఈ కీలక వ్యాఖ్యలు చేయTest{#}Hardik Pandya;Cameroon;Manam;March;CricketWTC ఫైనల్: కష్టపడకుండానే టెస్టు క్రికెట్ వదిలేసిన ఆటగాడు ఇతడే!WTC ఫైనల్: కష్టపడకుండానే టెస్టు క్రికెట్ వదిలేసిన ఆటగాడు ఇతడే!Test{#}Hardik Pandya;Cameroon;Manam;March;CricketMon, 05 Jun 2023 12:30:00 GMTభారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెడీ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొందరు క్రీడా నిపుణులు టీమిండియాలో వున్న ఒక లోటును ఎత్తి చూపుతున్నారు. విషయం ఏమంటే, భారత బృందంలో సరైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేడు. ఆసీస్ జట్టు కామెరూన్ గ్రీన్ ఆ పాత్ర పోషిస్తున్నాడు. కానీ భారత్‌లో అలాంటి ప్లేయర్ లేకపోవడం ఇపుడు చర్చనీయాంశమైంది. హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా అతను టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా త్రిపుర క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా వచ్చిన లాన్స్ క్లూసెనర్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.

ఈ క్రమంలో పాండ్యా చాలా ఈజీగా టెస్టు క్రికెట్‌ను వదిలేశాడని క్లూసెనర్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. చివరగా 2018లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన టెస్టులో పాండ్యా ఆడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2018 నుంచి 2021 వరకు వివిధ రకాల శరీర గాయాలతో బాధపడిన పాండ్యా.. ఇటీవలే పునరాగమనం చేశాడు. అయితే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసం కేవలం వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. మార్చి నెలలో డబ్ల్యూటీసీ గురించి మాట్లాడుతూ.. తను ఆ జట్టులో ఉండేందుకు ఏం చేయలేదని, కాబట్టి తను ఆడటం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు.

కాగా, ఇదే విషయంపై క్లూసెనర్‌ను తాజాగా విలేకరులు ప్రశ్నించగా దీనిపై అతగాడు మాట్లాడుతూ.. 'నిజమే.. పాండ్యా చాలా ఈజీగా టెస్టు క్రికెట్‌ను వదిలేశాడు. ఒక క్రికెటర్‌గా మనం ఏంటి? ఈ ఆట పుట్టినప్పటి నుంచి చూసుకున్నా కూడా టెస్టుల్లో పెద్దగా మార్పులు రాలేదు. ప్రస్తుతం టైం మారిపోయింది. పాండ్యా ఒక అద్భుతమైన ప్లేయర్. తను ఫిట్‌గా ఉండి 135+ స్పీడుతో బౌలింగ్ చేస్తే ప్రత్యర్థులకు ఖచ్చితంగా సవాల్‌గా మారగలడు. అతను ప్రపంచంలోని బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఎదుగుతాడు' అని చెప్పాడు. ఇలాంటి ప్లేయర్లు ఏ ఫార్మాట్‌లో అయినా కీలకమే అని ఈ సందర్భంగా తెలిపాడు.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ కోసం బాలీవుడ్ బ్యూటీ..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>