MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf4c3e203-d665-4b47-b77b-03ee06c9c4ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf4c3e203-d665-4b47-b77b-03ee06c9c4ab-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'బ్రో'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచభట్ల నిర్మాతలుగా సముద్రఖని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తమిళంలో హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాకి ఇది తెలుగు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక రీమేక్ కి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిగా శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలేtollywood{#}rakul preet singh;srinivas;vishwa;vivek;Accident;Samuthirakani;urvashi;Heroine;media;Remake;Pawan Kalyan;Priya;bollywood;Director;Cinema;kalyan;Telugu;Hero;Newsరిలీజ్ కి ముందే భారీ లాభాలను రాబట్టిన 'బ్రో'..?రిలీజ్ కి ముందే భారీ లాభాలను రాబట్టిన 'బ్రో'..?tollywood{#}rakul preet singh;srinivas;vishwa;vivek;Accident;Samuthirakani;urvashi;Heroine;media;Remake;Pawan Kalyan;Priya;bollywood;Director;Cinema;kalyan;Telugu;Hero;NewsMon, 05 Jun 2023 15:47:12 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'బ్రో'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచభట్ల నిర్మాతలుగా సముద్రఖని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తమిళంలో హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాకి ఇది తెలుగు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక రీమేక్ కి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిగా శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. 

దీంతో ఈ సినిమాకి భారీ స్థాయిలో బిజినెస్ కూడా జరుగుతోందట. తాజా సమాచారం ప్రకారం 'బ్రో' మూవీ బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్  అయిందట. అంతేకాదు రిలీజ్ కి ముందే ఈ మూవీకి భారీ స్థాయిలో లాభాలు కూడా వచ్చాయని అంటున్నారు. ఈ సినిమాకి అందరి రెమ్యూనరేషన్స్ తో కలిపి 120 కోట్ల బడ్జెట్ పెట్టారట నిర్మాతలు. అయితే ఈ సినిమాకి థియేట్రికల్ మరియు నాన్ థియెట్రికల్ రైట్స్ కలిపి ఏకంగా 175 కోట్లకు అమ్ముడయ్యాయని ప్రచారం జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ తో పాటు పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో ఉండటం వల్లే ఈ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపిస్తుండగా..

 సాయి ధరం తేజ్ యాక్సిడెంట్ లో చనిపోయి మళ్లీ బ్రతికే వరం పొందిన వ్యక్తిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రనిడివి కేవలం 20 నిమిషాల పాటు ఉండబోతుందట. అయినా కూడా పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ముందుగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని మూవీ టీమ్ సంప్రదించగా.. ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి నో చెప్పినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆమె స్థానంలో తాజాగా ఊర్వశి రౌతేల ను తీసుకున్నట్లు సమాచారం..!!



RRR Telugu Movie Review Rating

నేను సినిమాలు మానేస్తే ఆ కమెడియన్ సంబురాలు చేసుకున్నాడు.. బ్రహ్మానందం..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>