Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/is-sequal-will-come-to-bommarillu-movie0f1d3ed8-7e4f-44f8-95ed-f9fa1eef76a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/is-sequal-will-come-to-bommarillu-movie0f1d3ed8-7e4f-44f8-95ed-f9fa1eef76a8-415x250-IndiaHerald.jpgబొమ్మరిల్లు' సినిమా 2006లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ కూడా ఉంది. ఈ సినిమా రీ- రిలీజ్‌ కోసం అలాగే దాని పార్ట్‌ 2 కోసం ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారు. సినీ అభిమానుల తరఫున ఆ ప్రశ్నలను వ్యాఖ్యాత అడగ్గా 'టక్కర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు భాస్కర్‌ సమాధానమిచ్చారు. మళ్లీ ఆ సినిమాని థియేటర్లలో చూడాలని తనకూ కూడా ఆసక్తిగా ఉందని, రీ- రిలీజ్‌ గురించి నిర్మాత దిల్‌ రాజుని అడగాలని కూడా అన్నారు. పార్ట్‌ 2 గురించి మాటSocialstars lifestyle {#}sunday;Father;producer;Producer;Bommarillu;Darsakudu;Director;Hero;Telugu;Cinemaబొమ్మరిల్లు సినిమాకు సీక్వల్ రాబోతుందా...?బొమ్మరిల్లు సినిమాకు సీక్వల్ రాబోతుందా...?Socialstars lifestyle {#}sunday;Father;producer;Producer;Bommarillu;Darsakudu;Director;Hero;Telugu;CinemaMon, 05 Jun 2023 22:39:18 GMTబొమ్మరిల్లు' సినిమా 2006లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ కూడా ఉంది.

సినిమా రీ- రిలీజ్‌ కోసం అలాగే దాని పార్ట్‌ 2 కోసం ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారు. సినీ అభిమానుల తరఫున ఆ ప్రశ్నలను వ్యాఖ్యాత అడగ్గా 'టక్కర్‌'  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు భాస్కర్‌ సమాధానమిచ్చారు. మళ్లీ ఆ సినిమాని థియేటర్లలో చూడాలని తనకూ కూడా ఆసక్తిగా ఉందని, రీ- రిలీజ్‌ గురించి నిర్మాత దిల్‌ రాజుని అడగాలని కూడా అన్నారు. పార్ట్‌ 2 గురించి మాట్లాడుతూ.. సిద్ధార్థ్‌ అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నాడని, పదేళ్ల తర్వాతైనా అతడితో బొమ్మరిల్లు 2 తీయొచ్చని చెప్పుకొచ్చారు.సిద్ధార్థ్‌తో సినిమా తెరకెక్కించాలంటే దర్శకులకు చాలా తేలికైన పనని కూడా తెలిపారు.

మంచి ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచే 'బొమ్మరిల్లు'.. దర్శకుడి ఇంటిపేరుగా మారిన విషయం తెలిసిందే. అందులోని పలు సంభాషణలు, పాటలు ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంటాయి. హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్‌ జెనీలియా పాత్రలతోపాటు కథానాయకుడి తండ్రి పాత్ర ను తెలుగు ఆడియన్స్‌ ఎప్పటికీ కూడా మరిచిపోలేరు. 'టక్కర్‌' విషయానికొస్తే.. సిద్ధార్థ్‌ హీరోగా దర్శకుడు కార్తీక్‌ జీ తెరకెక్కించిన యాక్షన్‌ ఫిల్మ్‌ ఇది. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. జూన్‌ 9 ఈ సినిమా విడుదల అవుతుంది.సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. బొమ్మరిల్లు భాస్కర్‌తోపాటు దర్శకులు తరుణ్‌ భాస్కర్‌, వెంకటేశ్‌ మహా, ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకున్నారు.. పూర్తిస్థాయి యాక్షన్‌ నేపథ్యంలో సినిమా చేయాలనే తన కల టక్కర్‌తో నెరవేరిందని సిద్ధార్థ్‌ ఆ వేదికపై చెప్పుకొచ్చాడు.. టక్కర్‌లో తాను ఎంతో కొత్తగా కనిపిస్తానని ఆ వైవిధ్యాన్ని చూసేందుకు థియేటర్లకి రావాలని సిద్దార్థ్ ప్రేక్షకుల్ని కోరారు



RRR Telugu Movie Review Rating

ఒడిశా రైలు ప్రమాదం.. వాట్సప్‌ చేయండి?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>