MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood93a35542-e8ca-46cb-a3b7-8a33e03dad94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood93a35542-e8ca-46cb-a3b7-8a33e03dad94-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరో నాగచైతన్య రీసెంట్ గా నటించిన 'కస్టడీ' మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అఖిల్ 'ఏజెంట్' సినిమా తర్వాత విడుదలైన కస్టడీ మూవీ ఇప్పుడు ఓటిటిలో ఏజెంట్ కన్నా ముందే రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. తమిళ విలక్షణ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ మే 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను tollywood{#}arvind swamy;venkat prabhu;Kanna Lakshminarayana;vegetable market;NET FLIX;Darsakudu;Box office;Tamil;Naga Chaitanya;akhil akkineni;Kollywood;Director;Cinema;Audience;Telugu;Hero;Newsఏజెంట్ కన్నా ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'కస్టడీ'..?ఏజెంట్ కన్నా ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'కస్టడీ'..?tollywood{#}arvind swamy;venkat prabhu;Kanna Lakshminarayana;vegetable market;NET FLIX;Darsakudu;Box office;Tamil;Naga Chaitanya;akhil akkineni;Kollywood;Director;Cinema;Audience;Telugu;Hero;NewsMon, 05 Jun 2023 15:55:00 GMTఅక్కినేని హీరో నాగచైతన్య రీసెంట్ గా నటించిన 'కస్టడీ' మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అఖిల్ 'ఏజెంట్' సినిమా తర్వాత విడుదలైన కస్టడీ మూవీ ఇప్పుడు ఓటిటిలో ఏజెంట్ కన్నా ముందే రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. తమిళ విలక్షణ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ మే 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అటు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చింది. 

ఈ సినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్ పాత్రలో కనిపించడం కోసం బాగానే కష్టపడ్డాడు. కానీ ఆడియన్స్ ని మెప్పించడంలో ఈ సినిమా విఫలమైంది. ఇక తాజా సమాచారం ప్రకారం కస్టడీ మూవీ జూన్ 9 లేదా 16 తేదీలలో ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు డేట్స్ లో ఏ డేట్ అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కస్టడీ మూవీ ఓటిటి రైట్స్ ని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సుమారు 8 కోట్లకు తెలుగు తో పాటు తమిళ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో ఒకే తేదీన కస్టడీ మూవీ ఇటు తెలుగుతోపాటు తమిళంలోనూ ఓటీడీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడూ విభిన్న కథలను ఎంచుకొని తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే దర్శకుడు వెంకట ప్రభు ఈ సినిమాతో బాగా డిసప్పాయింట్ చేశాడు. నిజానికి కస్టడీ మూవీ విషయంలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో తడబడ్డాడు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో తమిళంలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాడు నాగచైతన్య. కానీ అలా జరగలేదు. సుమారు 20 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కనీసం 10 కోట్ల కలెక్షన్స్ ని కూడా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది...!!



RRR Telugu Movie Review Rating

భర్త ఉన్నా.. లేనట్టే.. వైరల్ అవుతున్న ప్రియమణి పోస్ట్..!?

కేసీఆర్, జగన్‌ మధ్య కొత్త చిచ్చు రగిలిందా?

రాహుల్‌పై గెలిచింది.. ఇప్పుడు కనిపించట్లేదు?

చైనాకు గట్టి షాక్‌ ఇవ్వబోతున్న మోదీ సర్కార్‌?

వావ్‌.. చంద్రుడిపై చైనా అద్భుత ప్రయోగాలు?

జనసేనతో కళకళలాడుతున్న లోకేశ్‌ పాదయాత్ర?

TV9 Vs NTV: ఏది అసలైన నెంబర్‌ వన్‌?

డేంజర్‌: భారత్‌లో ప్రమాదకరమైన ట్రెండ్‌?

నియంత కిమ్‌ను ఇబ్బంది పెడుతున్న కొత్త జబ్బు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>