Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1fcd1f10-a711-474c-92bf-6c46f71af868-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1fcd1f10-a711-474c-92bf-6c46f71af868-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎనిమిది పదుల వయసు దాటినా ఇంకా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. ఒక పక్క నార్త్ అండ్ సౌత్ మూవీల్లో నటిస్తూ, మరో పక్క టీవీ షోలు కూడా చేస్తూ అదరగొడుతున్నారు. కాగా అమితాబ్ కి 1983లో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం వలన అమితాబ్ కోమాలోకి వెళ్లడం కూడా జరిగింది. అసలు విషయం ఏంటంటే.. 1983 లో అమితాబ్ ‘కూలి ’ అనే సినిమాలో నటించారు. ఆ మూవీలో పునీత్ ఇస్సార్‌ విలన్ గా నటించాడు. ఇక వీరిద్దరి మధ్య ఒక ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్ తీవ్రంగాsocialstars lifestyle{#}Cheque;Amitabh Bachchan;Audience;Prabhas;television;Cinemaఅమితాబచ్చన్ కోమాలోకి వెళ్లి రావడానికి కారణం....!!అమితాబచ్చన్ కోమాలోకి వెళ్లి రావడానికి కారణం....!!socialstars lifestyle{#}Cheque;Amitabh Bachchan;Audience;Prabhas;television;CinemaMon, 05 Jun 2023 08:05:00 GMTబాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎనిమిది పదుల వయసు దాటినా ఇంకా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు.

ఒక పక్క నార్త్ అండ్ సౌత్ మూవీల్లో నటిస్తూ, మరో పక్క టీవీ షోలు కూడా చేస్తూ అదరగొడుతున్నారు. కాగా అమితాబ్ కి 1983లో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం వలన అమితాబ్ కోమాలోకి వెళ్లడం కూడా జరిగింది. అసలు విషయం ఏంటంటే.. 1983 లో అమితాబ్ ‘కూలి ’ అనే సినిమాలో నటించారు. ఆ మూవీలో పునీత్ ఇస్సార్‌ విలన్ గా నటించాడు.

ఇక వీరిద్దరి మధ్య ఒక ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదంలో అమితాబ్ పొత్తికడుపు ప్రాంతం నుంచి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. పలు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ ఆయనలో ఎటువంటి స్పందన లేకపోవడంతో వెంటిలేటర్‌ పై పెట్టిన వైద్యులు.. కుటుంబసభ్యులను దేవుడిని ప్రార్ధించుకోమని చెప్పారట. ఇక అమితాబ్ సతీమణి జయాబచ్చన్ ఆ మాటలతో చాలా భయాందోళనకు గురయ్యారు. దీంతో కొన్ని రోజుల పాటు చేతిలో హనుమాన్ చాలీసా పెట్టుకొని ప్రార్ధన చేస్తూ.. అమితాబ్ వద్దనే ఆమె కూర్చొని ఉన్నారట.

ఆ తరువాత అమితాబ్ బొటనవేలు కదలడాన్ని గమనించిన జయాబచ్చన్.. ఆ విషయాన్ని వెంటనే డాక్టర్స్ కి చెప్పారు. వైద్యులు చెక్ చేసి అమితాబ్ లో స్పందన గమనించారు. ఇక ఆయనకి అవసరమైన చికిత్సని అందించగా.. అమితాబ్ కోలుకొని మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే జయాబచ్చన్ మాత్రం.. ఈ సంఘటన తన జీవితంలో ఎప్పటికి మర్చిపోలేని చేదు జ్ఞాపకం అంటూ చెప్పుకొస్తారు. కాగా అమితాబ్ ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ మూవీ సెట్స్ లో కూడా అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డారు కానీ కొద్ది రోజుల్లోనే కోలుకున్నారు



RRR Telugu Movie Review Rating

పెళ్లిరోజే శర్వానంద్ తో అసౌకర్యానికి గురి ఐనా అతని భార్య...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>