PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan24a159ae-1cda-43cd-9b28-e1870a5289f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan24a159ae-1cda-43cd-9b28-e1870a5289f2-415x250-IndiaHerald.jpgకార్యక్రమంలో పాల్గొంటున్న అందరి పనితీరును జగన్ సమీక్షలు పెట్టి మరి ప్రకటించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని పదేపదే చాలామందికి చెప్పారు. జగన్ సమీక్షల కారణంగా కొందరు పనితీరును మెరుగుపరుచుకున్నారు. స్వతహాగానే చాలామంది జనాల్లో రెగ్యులర్ గా తిరుగుతున్నారు. అయితే నాలుగు సమీక్షలు జరిగినా ఎంతగా వార్నింగులిచ్చినా 32 మంది ఎంఎల్ఏలు మాత్రం పనితీరు మెరుగుపరుచుకోలేదని అర్ధమైందట. ఈ విషయంపైనే శుక్ర, శనివారాలు పూర్తిగా క్యాంపు ఆఫీసులోనే సర్వే రిపోర్టులు దగ్గరపెట్టుకుని ముఖ్యులతో సమీక్షించారట. ycp jagan {#}Survey;YCP;Reddy;Jagan;Partyఅమరావతి : 32 మందిపై వేటు తప్పదా ?అమరావతి : 32 మందిపై వేటు తప్పదా ?ycp jagan {#}Survey;YCP;Reddy;Jagan;PartyMon, 05 Jun 2023 09:00:00 GMT



రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా 32 మంది ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రాతిపదిక ఏమిటంటే వివిధ మార్గాల్లో చేయించుకుంటున్న  సర్వేల్లో 32 మంది ఎంఎల్ఏల గ్రాఫ్ ఏమాత్రం పెరగలేదని అర్ధమైందట. ఎంఎల్ఏల గ్రాఫ్ పెంచటానికే అందరినీ గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్ ఆదేశించింది. ఈ కార్యక్రమం జరుగుతున్న విధానం, ఎంఎల్ఏల పార్టిసిపేషన్ పై ఇంటెలిజెన్స్, పార్టీ నేతలతో పాటు సర్వే బృందాల నుండి కూడా రిపోర్టులు తెప్పించుకున్నారు.





కార్యక్రమంలో పాల్గొంటున్న అందరి పనితీరును జగన్ సమీక్షలు పెట్టి మరి ప్రకటించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని పదేపదే చాలామందికి చెప్పారు. జగన్ సమీక్షల కారణంగా కొందరు పనితీరును మెరుగుపరుచుకున్నారు. స్వతహాగానే చాలామంది జనాల్లో రెగ్యులర్ గా తిరుగుతున్నారు. అయితే నాలుగు సమీక్షలు జరిగినా ఎంతగా వార్నింగులిచ్చినా 32 మంది ఎంఎల్ఏలు మాత్రం పనితీరు మెరుగుపరుచుకోలేదని అర్ధమైందట. ఈ విషయంపైనే శుక్ర, శనివారాలు పూర్తిగా క్యాంపు ఆఫీసులోనే  సర్వే రిపోర్టులు దగ్గరపెట్టుకుని ముఖ్యులతో సమీక్షించారట.





ఈ సమీక్షల్లో 32 మంది ఎంఎల్ఏల విషయంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో పాటు పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఆసక్తిచూపని 32 మంది ఎంఎల్ఏలను పక్కనపెట్టాలన్నది జగన్ ఆలోచన. పార్టీలో కూడా వీళ్ళపై సరైన ఫీడ్ బ్యాక్ రాలేదట. అందుకనే 32 మంది స్ధానంలో కొత్తవాళ్ళకి టికెట్లిస్తే బాగుంటుందని జగన్ ఆలోచించారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.





80 శాతం నియోజకవర్గాల్లో 65 శాతం మంది జనాలు ప్రభుత్వపనితీరుపట్ల సంతృప్తిగా ఉన్నారట. మిగిలిన 20 శాతం నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల పనితీరుపై జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలిందట. ఆ 20 శాతం నియోజకవర్గాల్లోనే ఈ 32 మంది ఎంఎల్ఏలున్నారు. కాబట్టి వీళ్ళకు టికెట్లు దక్కే అవకాశాలు లేవని అర్ధమైపోయింది. వీళ్ళని తొందరలోనే పిలిచి మాట్లాడి పరిస్ధితిని వివరించాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఆపని ఎప్పుడు చేస్తారో ? వాళ్ళెలా రియాక్టవుతారో చూడాల్సిందే.  




RRR Telugu Movie Review Rating

అమరావతి : 32 మందిపై వేటు తప్పదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>