PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amitshah-chandrababu6bd493f7-9d49-4393-9a86-3525f1d9aa71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amitshah-chandrababu6bd493f7-9d49-4393-9a86-3525f1d9aa71-415x250-IndiaHerald.jpgఅంటే ఇక్కడ ఎల్లోమీడియా చెప్పదలచుకున్నది ఏమిటంటే బీజేపీనే చంద్రబాబును పిలిపించి పొత్తుల విషయాన్ని ప్రస్తావించిందని. పుచ్చుకునే చెయ్యి బీజేపీది ఇచ్చేచెయ్యి చంద్రబాబుది అన్నట్లుగా కలరింగ్ ఇచ్చుకున్నది. ఒకవైపు ఇచ్చుపుచ్చుకునే విషయాలు మాట్లాడుకున్నారని రాసిన ఎల్లోమీడియా మరోచోట పొత్తులపై చర్చలు జరగలేదు కేవలం ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. విచిత్రం ఏమిటంటే లోపల జరిగింది ఒకటైతే ఎల్లోమీడియా రాసింది మరోటని తెలిసిపోతోంది. amitshah chandrababu{#}Amit Shah;Bharatiya Janata Party;Amith Shah;Kathanam;TDP;CBN;central government;Reddy;Saturday;Andhra Pradesh;media;Jaganఢిల్లీ : చంద్రబాబును అమిత్ షా బతిమలాడుకున్నారా ?ఢిల్లీ : చంద్రబాబును అమిత్ షా బతిమలాడుకున్నారా ?amitshah chandrababu{#}Amit Shah;Bharatiya Janata Party;Amith Shah;Kathanam;TDP;CBN;central government;Reddy;Saturday;Andhra Pradesh;media;JaganMon, 05 Jun 2023 07:00:00 GMT



ఢిల్లీలో అమిత్ షా ను శనివారం రాత్రి చంద్రబాబునాయుడు కలిశారు. వీళ్ళిద్దరి మధ్య సుమారు గంటసేపు భేటీ జరిగింది. ఈ భేటీపై మీడియా రెండురకాల వెర్షన్లు ఇచ్చింది. ఎల్లోమీడియా ఏమో తెలంగాణా ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు తెలుగుదేశంపార్టీ సహకారం కావాలని చంద్రబాబును అమిత్ షా బతిమలాడుకున్నారనే అర్ధమొచ్చేట్లుగా కథనం ఇచ్చింది. బీజేపీకి సహకరించేందుకు అభ్యంతరం లేదుకాని ఏపీ సంగతి ఏమిటని చంద్రబాబు మెలికిపెట్టినట్లు చెప్పింది. ముందు ఏపీలో పొత్తుల సంగతి తేలిస్తే తెలంగాణాలో మద్దతివ్వటానికి ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పినట్లుగా కథనంలో ఉంది.





అంటే ఇక్కడ ఎల్లోమీడియా చెప్పదలచుకున్నది ఏమిటంటే బీజేపీనే చంద్రబాబును పిలిపించి పొత్తుల విషయాన్ని ప్రస్తావించిందని. పుచ్చుకునే చెయ్యి బీజేపీది  ఇచ్చేచెయ్యి చంద్రబాబుది అన్నట్లుగా కలరింగ్ ఇచ్చుకున్నది. ఒకవైపు ఇచ్చుపుచ్చుకునే విషయాలు మాట్లాడుకున్నారని రాసిన ఎల్లోమీడియా మరోచోట పొత్తులపై చర్చలు జరగలేదు కేవలం ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. విచిత్రం ఏమిటంటే లోపల జరిగింది ఒకటైతే ఎల్లోమీడియా రాసింది మరోటని తెలిసిపోతోంది.





ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీడియా ఏమో తెలంగాణాలో బీజేపీ గెలుపుకు టీడీపీ సహకరిస్తుందని చంద్రబాబే ఆఫర్ చేసినట్లు రాసింది. దీనికి బదులుగా అమిత్ షాను చంద్రబాబు మూడు కోరికలు కోరినట్లు చెప్పింది. అవేమిటంటే ఏపీలో కూడా పొత్తులు పెట్టుకోవటం, తన పరిపాలనలో జరిగిన అవినీతిపై జగన్ ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తును ఆపుచేయించటం, మార్గదర్శి మోసాలపై విచారణను ఆపుచేయించటం, జగన్ కు కేంద్ర సహకారన్ని నిలిపేయటం. దీనిపై షా మాట్లాడుతు అందరు అనుకుంటున్నట్లు జగన్ కు కేంద్రప్రభుత్వం ఎలాంటి సహకారం అందివ్వటంలేదని స్పష్టం చేశారట.





మొత్తంమీద ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లుగా దాదాపు ఐదేళ్ళ తర్వాత అమిత్ షాను చంద్రబాబు కలవగలిగారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని చంద్రబాబు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారో అందరు చూస్తున్నదే. ఐదేళ్ళ విశ్వప్రయత్నాల తర్వాత అమిత్ ను చంద్రబాబు కలిసి పొత్తులపై మాట్లాడారాట. నిజానికి వీళ్ళిద్దరి మధ్య పొత్తులపై చర్చలు జరగనలేదని తెలుస్తోంది.  మరి ముందుముందు ఇంకెన్ని భేటీలవుతాయో చూడాలి.




RRR Telugu Movie Review Rating

వైరల్ గా మారిన సింగర్ ఎమోషనల్ పోస్ట్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>