Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/virate9f9fcac-0b4c-473b-abc2-0f84a13276bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/virate9f9fcac-0b4c-473b-abc2-0f84a13276bc-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీలకు క్రికెటర్లకు మధ్య ఎన్నో ఏళ్ల నుంచి బలమైన బంధమే కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న హీరోయిన్లు ఇంకా ఎంతో మంది క్రికెటర్లతో ప్రేమలో పడటం.. ఇక డేటింగ్ లో మునిగి తేలడం లాంటివి ఎన్నోసార్లు జరిగాయి. అంతేకాదు ఇక ఎంతోమంది క్రికెటర్లు సినీ సెలబ్రిటీలను పెళ్లి చేసుకోవడం కూడా చేశారు. ఇందుకు సరైన ఉదాహరణ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మాత్రం క్రికెట్ ని అటు సినిమాలతో మెలి పెడుతూ ఎన్నో రకాల పోస్టులుVirat{#}kalyan;mahesh babu;Guntur;Tollywood;marriage;Hero;Red chilly powder;Gabbar Singh;Anushka Sharma;Cinema;Telugu;VIRAT KOHLI;Australia;Cricketమహేష్ 'గుంటూరు కారం' లుక్ లో.. విరాట్ కోహ్లీ?మహేష్ 'గుంటూరు కారం' లుక్ లో.. విరాట్ కోహ్లీ?Virat{#}kalyan;mahesh babu;Guntur;Tollywood;marriage;Hero;Red chilly powder;Gabbar Singh;Anushka Sharma;Cinema;Telugu;VIRAT KOHLI;Australia;CricketSun, 04 Jun 2023 10:15:00 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీలకు క్రికెటర్లకు మధ్య ఎన్నో ఏళ్ల నుంచి బలమైన బంధమే కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న హీరోయిన్లు ఇంకా ఎంతో మంది క్రికెటర్లతో ప్రేమలో పడటం.. ఇక డేటింగ్ లో మునిగి తేలడం లాంటివి ఎన్నోసార్లు జరిగాయి. అంతేకాదు ఇక ఎంతోమంది క్రికెటర్లు సినీ సెలబ్రిటీలను పెళ్లి చేసుకోవడం కూడా చేశారు. ఇందుకు సరైన ఉదాహరణ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మాత్రం క్రికెట్ ని అటు సినిమాలతో మెలి పెడుతూ ఎన్నో రకాల పోస్టులు వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ హీరోలకి సంబంధించి ఏదైనా సినిమా పోస్టర్ విడుదలైందంటే చాలు.. ఆ సినిమా పోస్టర్ ను తనదైన శైలిలో ఎడిట్ చేసి.. ఇక స్టార్ హీరో ఫేస్ దగ్గర తన మొహం పెట్టి.. ఇక ఎన్నో పోస్టులను సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల కాలంలో అటు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఇలాంటి తరహా ట్రెండును బాగా ఫాలో అవుతున్నాయి.  మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ వస్తాద్  గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే ఇలా పవన్ కళ్యాణ్ ఫోటోని ఎడిట్ చేసి ఇక విరాట్ కోహ్లీ మొహాన్ని జోడించారు. ఈ లుక్ గురించి మరవకముందే ఇక ఇప్పుడు మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 ఇటీవలే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది అన్న విషయం తెలిసిందే. అయితే గుంటూరు కారం ఫస్ట్ లుక్ లో విరాట్ కోహ్లీని జత చేస్తూ స్టార్ స్పోర్ట్స్ తెలుగు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఏందట్టా చూస్తున్నావ్.. దెబ్బ త్రిడిలో కనబడుతుందా అంటూ సినిమాలోని డైలాగులు పంచుకుంటుంది. మహేష్ బాబు విలన్లను రఫ్పాడించినట్లుగానే విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసి ఫైనల్ లోను రఫ్ ఆడిస్తాడా అంటూ అభిమానులను ప్రశ్నించింది. ఇక ఈ ఫోటో వైరల్ గా మారిపోవడంతో సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

వాటికీ భయపడి ఇండస్ట్రీని వదిలేసినా సోనమ్ బజ్వా....!!

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>