MoneyChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/rbiac4e72a8-c678-4d71-a673-bf294a53e357-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/rbiac4e72a8-c678-4d71-a673-bf294a53e357-415x250-IndiaHerald.jpgపటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంటేనే బ్యాంకింగ్ రంగం ముందుకు వెళ్తుంది. అమెరికా వద్ద కూడా ఇలాంటి పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. కానీ ఆ వ్యవస్థ లోని లోపాల వల్ల ఎదురు దెబ్బలు తింటున్న పరిస్థితి ఇప్పుడు. కొన్ని బ్యాంకుల్లో కార్పొరేట్ పాలనలో లోపాలు ఉన్నాయని, మరి కొన్ని బ్యాంకుల్లో బ్యాంకింగ్ రంగంలో రుణము దాచిపెట్టి ఉంచడానికి వాడే స్మార్ట్ అకౌంటింగ్ విధానం పట్ల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తి కాంత్ దాస్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆర్బిఐ నుండి ఎప్పుడూ స్పష్టమైన మార్గదర్శకాలే ఉంటాయని ఆయన అన్నారు. అRBI{#}American Samoa;Bank;Banking;central government;Corporate;Shaktiఆ పని చేయొద్దు.. రిజర్వ్‌ బ్యాంకు వార్నింగ్‌?ఆ పని చేయొద్దు.. రిజర్వ్‌ బ్యాంకు వార్నింగ్‌?RBI{#}American Samoa;Bank;Banking;central government;Corporate;ShaktiSun, 04 Jun 2023 09:00:00 GMTపటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంటేనే బ్యాంకింగ్ రంగం ముందుకు వెళ్తుంది. అమెరికా వద్ద కూడా ఇలాంటి పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. కానీ ఆ వ్యవస్థ లోని లోపాల వల్ల ఎదురు దెబ్బలు తింటున్న పరిస్థితి ఇప్పుడు. కొన్ని బ్యాంకుల్లో కార్పొరేట్ పాలనలో లోపాలు ఉన్నాయని, మరి కొన్ని బ్యాంకుల్లో బ్యాంకింగ్ రంగంలో రుణము దాచిపెట్టి ఉంచడానికి వాడే స్మార్ట్ అకౌంటింగ్ విధానం పట్ల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తి కాంత్ దాస్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.


ఆర్బిఐ నుండి ఎప్పుడూ స్పష్టమైన మార్గదర్శకాలే ఉంటాయని ఆయన అన్నారు. అయినా కూడా కొన్ని బ్యాంకుల్లో కార్పొరేట్ పాలనలో లోపాలను కేంద్ర బ్యాంక్ కనిపెట్టిందని ఆయన బ్యాంకుల డైరెక్టర్ల సమావేశంలో చెప్పారు. అలాంటి లోపాలు బ్యాంకింగ్ రంగంలో ఒక స్థాయి ఆటుపోట్లకు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. కార్పొరేట్ పాలనలో లోపాలు చోటు చేసుకునేందుకు బ్యాంకు బోర్డులు, మేనేజ్మెంట్లు అనుమతించ కూడదని ఆయన అన్నారు.


బ్యాంకులో కార్పొరేట్ పాలన పటిష్టంగా ఉండేలా చూసుకోవడం అనేది బోర్డ్ చైర్మన్లు, హోల్డ్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ లు ఇంకా పార్ట్ టైం డైరెక్టర్ల  ఉమ్మడి బాధ్యత అని ఆయన నొక్కి వక్కాణించారు. అలాగే కొన్ని బ్యాంకులు స్మార్ట్ అకౌంటింగ్ పేరిట ఆర్థిక పరిమితులు సక్రమంగా ఉన్నట్లు కృత్రిమంగా చూపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో రెండు బ్యాంకులు కలిసి పరస్పరం సహకరించుకుంటాయని ఆయన చెప్పారు.


ఉభయుల పద్దులు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయని చూపించుకోవడం కోసం పరస్పరం రుణాలు విక్రయించుకోవడం, బై బ్యాక్ వంటి కార్యక్రమాలకు పాల్పడతాయని ఆయన అన్నారు. ఉభయులకు చెందినటువంటి మంచి రుణపు ఖాతాదారులను తమతో నిర్మాణాత్మక డీల్ కి రావాలని ఒప్పిస్తాయని ఆయన అన్నారు. ఒకవేళ ఆర్బిఐ ఇలాంటి కార్యక్రమాలను గుర్తించి హెచ్చరించినట్లయితే దాని స్థానంలో ఇంకో కొత్త పథకాన్ని ప్రవేశపెడతాయని ఆయన వివరించారు. ఇలాంటి కార్యకలాపాలపై కన్నేసి ఉంచాలని అన్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : తమ్ముళ్ళు చంద్రబాబుకు షాకిస్తున్నారా ?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>