Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-745a499f-66aa-4b21-8b80-671a00ead011-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-745a499f-66aa-4b21-8b80-671a00ead011-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత మనిషిలో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మాత్రం రోజురోజుకు పూర్తిగా చచ్చిపోతుందేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే నేటి రోజుల్లో బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఎలాంటి సమస్య వచ్చిన దానికి పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అనే విధంగా నేటి రోజుల్లో జనాలు ఆలోచిస్తూ ఉన్నారు. దీంతో క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఇలాంటి తSuicide {#}Yellampalli;mandalam;Medak;Kamareddy;Uri;policeపెళ్లయి ఏడాది కూడా కాలేదు.. అంతలోనే?పెళ్లయి ఏడాది కూడా కాలేదు.. అంతలోనే?Suicide {#}Yellampalli;mandalam;Medak;Kamareddy;Uri;policeSun, 04 Jun 2023 10:05:00 GMTఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత మనిషిలో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మాత్రం రోజురోజుకు పూర్తిగా చచ్చిపోతుందేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే నేటి రోజుల్లో బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఎలాంటి సమస్య వచ్చిన దానికి పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అనే విధంగా నేటి రోజుల్లో జనాలు ఆలోచిస్తూ ఉన్నారు. దీంతో క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు అని చెప్పాలి.


  ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని ఒక అయ్యా చేతిలో పెట్టారు తల్లిదండ్రులు. ఇక మెట్టినింట్లో కూతురు ఎంతో సంతోషంగా ఉంటుందని భావించారు.  కానీ కూతురికి మెట్టినింట్లో  అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే వేధింపులు మొదలయ్యాయి. దీంతో వేధింపుల గురించి పుట్టినింట్లో చెప్పుకోలేక ఇక వేధింపులను భరించలేక తనలో తానే కుంగిపోయింది ఆ మహిళ. చివరికి ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావించి బలవన్మరణానికి పాల్పడింది.


 ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కోరంపల్లిలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఎల్లంపల్లి శిల్ప అనే 24 ఏళ్ల యువతీ ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా గోపాలపేట మండలం సిరూర్ గ్రామానికి చెందిన శిల్పకు కోరంపల్లికి చెందిన సిద్ధరాములకు ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే ఆరు నెలలుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఇక ఇటీవల మరోసారి అత్తతో గొడవ పడిన శిల్ప ఇంట్లో ఉరి వేసుకుంది. అయితే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

వాటికీ భయపడి ఇండస్ట్రీని వదిలేసినా సోనమ్ బజ్వా....!!

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>