DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/iranf7f383d4-351b-4fe1-9029-6e60f15f0535-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/iranf7f383d4-351b-4fe1-9029-6e60f15f0535-415x250-IndiaHerald.jpgనిజానికి ఏ వర్గాల మధ్యనైనా కట్టుబాట్లు పెట్టుకోవడానికి కారణం పద్ధతిగా కలిసి మెలిసి ఉండడానికి. కానీ అలాంటి కట్టుబాట్లు, ఒప్పందాలు కనుక వీళ్ళ మధ్యలో ఎవరైనా తప్పితే అది కలహానికి కారణం అవుతూ ఉంటాయి. అయితే ఇరాన్ ఇంకా ఆఫ్గనిస్తాన్ మధ్యన ఇప్పుడు ఈ కట్టుబాటు తప్పడం వల్ల ఒక రకంగా యుద్ధం మొదలైంది అని చెప్పుకోవాలి. ఈ యుద్ధానికి ఇప్పుడు అసలైన కారణం అక్కడ ప్రవహిస్తున్నటువంటి ఒక నది అని తెలుస్తుంది. ఆ నది పేరే హేల్మండ్ నది. 2000 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నది ఆఫ్గనిస్తాన్ లో ప్రారంభమై హిందూ కుష్ పర్వతశ్రేణIRAN{#}Iran;war;contract;Afghanistan;American Samoaఓ నది కోసం.. ఇరాన్‌, ఆఫ్ఘన్ల యుద్ధం?ఓ నది కోసం.. ఇరాన్‌, ఆఫ్ఘన్ల యుద్ధం?IRAN{#}Iran;war;contract;Afghanistan;American SamoaSun, 04 Jun 2023 07:00:00 GMTనిజానికి ఏ వర్గాల మధ్యనైనా కట్టుబాట్లు పెట్టుకోవడానికి కారణం పద్ధతిగా కలిసి మెలిసి ఉండడానికి. కానీ అలాంటి కట్టుబాట్లు, ఒప్పందాలు కనుక వీళ్ళ మధ్యలో ఎవరైనా తప్పితే అది కలహానికి కారణం అవుతూ ఉంటాయి. అయితే ఇరాన్ ఇంకా ఆఫ్గనిస్తాన్ మధ్యన ఇప్పుడు ఈ కట్టుబాటు తప్పడం వల్ల ఒక రకంగా యుద్ధం మొదలైంది అని చెప్పుకోవాలి. ఈ యుద్ధానికి ఇప్పుడు అసలైన కారణం అక్కడ ప్రవహిస్తున్నటువంటి ఒక నది అని తెలుస్తుంది.


ఆ నది పేరే హేల్మండ్ నది. 2000 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నది ఆఫ్గనిస్తాన్ లో ప్రారంభమై హిందూ కుష్ పర్వతశ్రేణుల నుండి ఇరాన్ లో ప్రవేశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ వాళ్లు ఈ నదిని ఇరాన్లోకి రానివ్వకుండా ఆపేసారట. వాస్తవానికి నిమ్రస్ అనే బోర్డర్ దగ్గర ఈ గొడవలు మొదలయ్యాయి అని తెలుస్తుంది. వాస్తవానికి గతంలో ఆఫ్గనిస్తాన్ 1940-50సంవత్సరాల మధ్యలో రెండు బ్రిడ్జిలను నిర్మించిందట.


అయితే 1973వరకు ఇరాన్ ఇంకా ఆఫ్గనిస్తాన్ మధ్య ఉన్న మౌఖిక ఒప్పందం మీరిన పరిస్థితి వచ్చిందట. దాంతో కొత్తగా అక్కడ ప్రాజెక్టులు ఏమీ కట్టకూడదు, ఇంకా నీటిని నిల్వ చేయకూడదు. అప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల వరకు అయితే ఓకే అని 1973లో వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తుంది. ఆ నది ఇరాన్ లోకి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆ నది నీటిని వాళ్ళు త్రాగునీరుగా ఉపయోగిస్తారు ఇంకా వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తారు.


ఆ రకంగా వాళ్ళ మధ్య 73లో ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ నుండి మొదలయ్యే ఈ నదికి సంబంధించిన నీరు ఇరాన్లోకి రావడం లేదని తెలుస్తుంది. దాంతో ఇరాన్ సైన్యం ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ సైన్యం మీద దాడి చేసారట.  ఇప్పటి వరకు రష్యా, అమెరికా ఇంకా నాటో దేశాలు ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయాయి. మరి ఇరాన్ పరిస్థితి ఏంటో చూడాలి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : తమ్ముళ్ళు చంద్రబాబుకు షాకిస్తున్నారా ?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>