Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-d9aaefe2-5481-4c81-9158-96a9dac9a295-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-d9aaefe2-5481-4c81-9158-96a9dac9a295-415x250-IndiaHerald.jpgఅవును, ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సొంతం చేసుకొని ఏకంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన మొట్ట మొదటి కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌ విజయంతో బెన్ స్టోక్స్ ఈ ఫీట్ సాధించడం విశేషం. శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేయకపోవడం గమనార్హం. ఇకపోతే మోకాలి గాయంతో Cricket {#}Ireland;Ben Stokes;Saturday;Cricketబెన్ స్టోక్స్ అరుదైన రికార్డ్... క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్‌గా!బెన్ స్టోక్స్ అరుదైన రికార్డ్... క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్‌గా!Cricket {#}Ireland;Ben Stokes;Saturday;CricketSun, 04 Jun 2023 18:15:00 GMTఅవును, ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సొంతం చేసుకొని ఏకంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన మొట్ట మొదటి కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌ విజయంతో బెన్ స్టోక్స్ ఈ ఫీట్ సాధించడం విశేషం. శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేయకపోవడం గమనార్హం.

ఇకపోతే మోకాలి గాయంతో కొన్నాళ్లుగా బాధపడుతున్న బెన్ స్టోక్స్ చాలా రోజులుగా బౌలింగ్ చేయడం లేదు. ఇక తాజాగా పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ యాషెస్ సిరీస్ కోసం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఈ మ్యాచ్‌ను వామప్‌గా భావించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ గెలిచారని చెప్పుకోవచ్చు. ఇక 97/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో 3వ రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఐర్లాండ్.. 86.2 ఓవర్లలో 362 పరుగులకు పెవిలియన్ చేరింది.

ఆండీ మెక్‌బ్రైన్ 115 బంతుల్లో 14 ఫోర్లతో రెచ్చి పోయి 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మార్క్ అడైర్ 76 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి (88) హాఫ్ సెంచరీలతో రాణించారు. 162 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ను ఈ ఇద్దరు ఆదుకున్నారని చెప్పుకోవచ్చు. అలా మొత్తంగా అద్భుతమైన ఆటతీరుని కనబరుస్తూ ఏడో వికెట్‌కు 163 పరుగులు చేసారు. ఇంకేముంది, కట్ చేస్తే ఇంగ్లండ్ విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడినా.. ఆ జట్టు టెయిలెండర్స్ ఇంగ్లండ్ బౌలర్లను మాత్రం ముప్పుతిప్పలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇంగ్లండ్ ముందు 11 పరుగుల లక్ష్యం నమోదవ్వగా.. ఇంగ్లండ్ 4 బంతుల్లోనే విజయాన్ని ఛేదించిందని చెప్పుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

నా మైండ్ సీసీటీవీ లాంటిది : అనుపమ

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>