MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money0bb58905-fb3e-49dc-bd6c-9973714290e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money0bb58905-fb3e-49dc-bd6c-9973714290e2-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తే తప్ప భవిష్యత్తును అందంగా మార్చుకోలేరు. మరీ ముఖ్యంగా అసంఘటిత రంగంలోని వ్యక్తుల భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ పథకాలలో డబ్బులు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే వృద్ధాప్య సమయంలో ఇద్దరు పదివేల రూపాయలను పెన్షన్ కింద పొందుతారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం పేరు అటల్ పెన్షన్ యోజన పథకం. ముఖ్యంగా స్వయం ఉపాధి , కూలి పనులు చేసుకునే వ్యక్తులు చిన్న తరహా వ్యMONEY{#}Narendra Modi;central government;GovernmentMoney: ఈ పథకంలో చేరితే భార్యాభర్తలిద్దరికీ నెలకు రూ.10 వేలు..!Money: ఈ పథకంలో చేరితే భార్యాభర్తలిద్దరికీ నెలకు రూ.10 వేలు..!MONEY{#}Narendra Modi;central government;GovernmentSun, 04 Jun 2023 11:00:00 GMTప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తే తప్ప భవిష్యత్తును అందంగా మార్చుకోలేరు. మరీ ముఖ్యంగా అసంఘటిత రంగంలోని వ్యక్తుల భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ పథకాలలో డబ్బులు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే వృద్ధాప్య సమయంలో ఇద్దరు పదివేల రూపాయలను పెన్షన్ కింద పొందుతారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం పేరు అటల్ పెన్షన్ యోజన పథకం.

ముఖ్యంగా స్వయం ఉపాధి , కూలి పనులు చేసుకునే వ్యక్తులు చిన్న తరహా వ్యాపారులకు ఈ పథకం ఆర్థిక సమస్యలను తొలగిస్తోంది. 2015 లోనే నరేంద్ర మోడీ ఈ స్కీం ప్రవేశపెట్టగా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ ఇందులో డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే ఈ అటల్ పెన్షన్ యోజన పథకం అనేది నేషనల్ పెన్షన్ సిస్టం ఆర్కిటెక్చర్ ద్వారా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహణలో ప్రధమంగా పనిచేస్తుంది.

అర్హులైన వారు ఇందులో నెలవారీగా 1000 రూపాయల నుంచి రూ.5000 వరకు పెన్షన్ పొందుతారు.  ఇకపోతే ఇప్పటికే ఈ స్కీం లో ఐదు కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా లాంఛ్ అయినప్పటి నుంచి ప్రజల నుంచి ఈ పథకానికి మంచి స్పందన లభిస్తుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎవరైనా సరే ఇందులో చేరవచ్చు. ఎవరైతే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారో అలాంటివారు ఈ పథకంలో చేరడానికి అర్హులు కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో మీరు నెలవారి 5000 రూపాయలు పెన్షన్ పొందాలి అనుకుంటే అందుకు తగ్గట్టుగా మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక భార్యాభర్తలిద్దరూ కూడా ఈ పథకంలో చేరినట్లయితే ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున ఇద్దరికీ నెలకు పదివేల రూపాయలు పెన్షన్ రూపంలో లభిస్తాయి. ఇక పూర్తి వివరాల కోసం దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించవచ్చు.



RRR Telugu Movie Review Rating

వాటికీ భయపడి ఇండస్ట్రీని వదిలేసినా సోనమ్ బజ్వా....!!

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>