PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-jagan-modibb44c009-f4fb-43c2-877b-84500a1b657c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-jagan-modibb44c009-f4fb-43c2-877b-84500a1b657c-415x250-IndiaHerald.jpgనిజానికి జగన్ను తప్పుపడుతున్న చాలావాటిల్లో అసలు బాధ్యుడు చంద్రబాబే. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్ళయినా ప్రత్యేకహోదా ఎందుకు సాధించలేదని జగన్ను నిలదీయటమే విచిత్రంగా ఉంది. విభజన జరిగి తొమ్మిదేళ్ళయింది నిజమే కానీ మొదటి ఐదేళ్ళు అధికారంలో ఉన్నది చంద్రబాబే. ప్రత్యేకహోదా స్ధానంలో ప్రత్యేకప్యాకేజీ ఇస్తామని నరేంద్రమోడీ ప్రభుత్వం అంటే దాన్ని మహాప్రసాదంగా స్వీకరించిందే చంద్రబాబు. హోదాతో పోల్చితే ప్యాకేజీయే బ్రహ్మాండమని ఊరూవాడ డప్పుకొట్టింది చంద్రబాబే. చంద్రబాబు హోదా వద్దని చెప్పేసిన తర్వాత ఇక కేంద్రం ఎందుకtdp chandrababu jagan modi{#}Jagan;Amaravati;Rajya Sabha;polavaram;Vishakapatnam;Polavaram Project;Vijayawada;Narendra Modi;Government;Reddy;CBNఅమరావతి : చంద్రబాబే అసలు కారణమా ?అమరావతి : చంద్రబాబే అసలు కారణమా ?tdp chandrababu jagan modi{#}Jagan;Amaravati;Rajya Sabha;polavaram;Vishakapatnam;Polavaram Project;Vijayawada;Narendra Modi;Government;Reddy;CBNSun, 04 Jun 2023 07:00:00 GMT


మీడియా సమావేశంలో మాట్లాడుతు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో సర్వనాశనమైపోయిందని చంద్రబాబునాయుడు మండిపోయారు. ప్రత్యేకహోదా సాధించలేదట, విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ రాలేదట, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు తేలేదట, అమరావతి రాజధానిని నిర్మించలేదని..ఇలా చాలా చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చింది కేవలం వ్యాపారాలు చేసుకోవటానికి మాత్రమే అంటు రెచ్చిపోయారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతలా బరితెగించలేదన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులు దెబ్బతినేశాయి, కడపలో ఉక్కుఫ్యాక్టరీ కూడా తేలేకపోయినట్లు చెప్పారు.





నిజానికి జగన్ను తప్పుపడుతున్న చాలావాటిల్లో అసలు బాధ్యుడు చంద్రబాబే. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్ళయినా ప్రత్యేకహోదా ఎందుకు సాధించలేదని జగన్ను నిలదీయటమే విచిత్రంగా ఉంది. విభజన జరిగి తొమ్మిదేళ్ళయింది నిజమే కానీ మొదటి ఐదేళ్ళు అధికారంలో ఉన్నది చంద్రబాబే. ప్రత్యేకహోదా స్ధానంలో ప్రత్యేకప్యాకేజీ ఇస్తామని నరేంద్రమోడీ ప్రభుత్వం అంటే దాన్ని మహాప్రసాదంగా స్వీకరించిందే చంద్రబాబు. హోదాతో పోల్చితే ప్యాకేజీయే బ్రహ్మాండమని ఊరూవాడ డప్పుకొట్టింది చంద్రబాబే. చంద్రబాబు హోదా వద్దని చెప్పేసిన తర్వాత ఇక కేంద్రం ఎందుకిస్తుంది.





ఇక జాతీయ ప్రాజెక్టుహోదాలో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుండి బలవంతంగా లాక్కున్నదే చంద్రబాబు. ప్రాజెక్టు కేంద్రంలో చేతిలోనే ఉండుంటే ఏమిచేసేదో తేలిపోయేది. విశాఖ రైల్వేజోన్ ఇవ్వటంలేదంటే సరే అన్నది చంద్రబాబు ప్రభుత్వమే. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్ పంపమంటే మూడేళ్ళు పంపకుండా కూర్చున్నది చంద్రబాబు ప్రభుత్వమే.





ఇక కేసుల మాఫీకోసం కేంద్రం ఆడమన్నట్లు ఆడుతున్నారంటు జగన్ పై బురదచల్లేశారు. అదే నిజమైతే మరి కేసులన్నీ కొట్టేసుండాలి కదా. ఇక పైరవీల కోసమే మూడు రాజ్యసభ ఎంపీ పదవులను అమ్ముకున్నట్లు జగన్ పై ఆరోపించారు. మూడు రాజ్యసభ ఎంపీ పదవులను ఎవరికి ? ఎంతకు ? అమ్ముకున్నారో మాత్రం చెప్పలేదు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందే మొదట చంద్రబాబు. అదే దారిలో జగన్ నడుస్తున్నారంతే. ఇక కేసులంటారా జగన్ మీదున్నట్లే చంద్రబాబు మీద కూడా ఓటుకునోటు కేసు ఉండనే ఉంది. కాకపోతే విచారణ జరగటంలేదంతే. 


 







RRR Telugu Movie Review Rating

అమరావతి : తమ్ముళ్ళు చంద్రబాబుకు షాకిస్తున్నారా ?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>