Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama2463a910-04ac-441c-8f7d-bac93c80c146-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama2463a910-04ac-441c-8f7d-bac93c80c146-415x250-IndiaHerald.jpgఅనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తన అందం అభినయంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపుని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఒక రకంగా తన కొంటె చూపులతోనే కుర్ర కారు మతి పోగొట్టింది . ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ అదరగొట్టింది అని చెప్పాలి. అయితే ఇక అనుపమ పరమేశ్వరన్ ఏ పాత్రలో నటించిన తన నటనతో ఆ పాAnupama{#}Shakti;media;Car;Tollywoodనా మైండ్ సీసీటీవీ లాంటిది : అనుపమనా మైండ్ సీసీటీవీ లాంటిది : అనుపమAnupama{#}Shakti;media;Car;TollywoodSun, 04 Jun 2023 19:00:00 GMTఅనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తన అందం అభినయంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి..  ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపుని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఒక రకంగా తన కొంటె చూపులతోనే కుర్ర కారు మతి పోగొట్టింది . ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ అదరగొట్టింది అని చెప్పాలి. అయితే ఇక అనుపమ పరమేశ్వరన్ ఏ పాత్రలో నటించిన తన నటనతో ఆ పాత్రకి ప్రాణం పోస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 అయితే ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు. అయితే అనుపమ పరమేశ్వరన్ విషయంలో ఇక ఈ అదృష్టమే కలిసి రాలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే అనుపమ ఇక పాత్రలో ఒదిగిపోయే తీరు వేరే లెవెల్లో ఉంటుంది.  కానీ ఈ అమ్మడికి మాత్రం ఇంకా సరైన గుర్తింపు రాలేదు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ప్రస్తుతం సినిమాల్లో సరైన అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారానే అభిమానులను అలరిస్తుంది అనుపమ పరమేశ్వరన్. ఇకపోతే ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది  ఈ ముద్దుగుమ్మ. తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది.


 తన మనసును నొప్పించే విషయాన్ని అయినా లేదంటే బాధాకరమైన సంఘటనైనా వీలైనంత త్వరగా మర్చిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాను అంటూ చెబుతుంది అనుపమ. భావోద్వేగాలు ప్రదర్శించే విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటూ ప్రశ్నిస్తే తనదైన శైలిలో సమాధానం చెప్పింది. భావోద్వేగాలు వ్యక్తపరిచే విషయంలో నేను చాలా పారదర్శకంగా ఉంటా. నాకేదైనా నచ్చలేదంటే అప్పటికప్పుడు ముఖం మీద చెప్పేస్తా. ఇక ఆ విషయాన్ని కూడా అక్కడే వదిలేస్తే. ఎందుకంటే జీవితం చాలా చిన్నది కొన్నాళ్ళు ఉంటాం వెళ్లిపోతాం ఆరోజు ఎప్పుడొస్తుంది అన్నది ఎవరికి తెలియదు. కాబట్టి జీవించి ఉన్నన్ని రోజులు ఒత్తిడి దాచుకోవడానికి మన శక్తి ఎందుకు వేస్ట్ చేయాలి. సీసీటీవీ లో కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఫుటేజ్ డిలీట్ అయినట్లు నా మెదడును కూడా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటా అంటూ అనుపమ తెలిపింది.



RRR Telugu Movie Review Rating

నా మైండ్ సీసీటీవీ లాంటిది : అనుపమ

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>