PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-kodela-sattenapalli051206ec-42ce-4788-86f2-8e9002cabdb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-kodela-sattenapalli051206ec-42ce-4788-86f2-8e9002cabdb8-415x250-IndiaHerald.jpgకన్నాను ఇన్చార్జిగా చేస్తే శివరామ్ తిరగబడతాడని చంద్రబాబుకు బాగా తెలుసు. తెలిసే కన్నాను నియమించారు. అయితే శివరామ్ కూడా చేసేదేమీలేదు. ఎందుకంటే చిన్నకోడెల ట్రాక్ రికార్డు కూడా చాలా చెత్తగా ఉంది. తండ్రి పదవిని అడ్డంపెట్టుకుని శివరామ్ తో పాటు అతని సోదరి విజయలక్ష్మి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో చాలా అరాచకాలకు పాల్పడ్డారు. దాంతో పార్టీమొత్తం వ్యతిరేకమైపోయింది. tdp chandrababu kodela sattenapalli{#}vijayalakshmi;Kodela Siva Prasada Rao;narasaraopet;Kanna Lakshminarayana;CBN;Party;Fatherఅమరావతి : ఇంత ప్లాన్డుగా దెబ్బకొట్టారా ?అమరావతి : ఇంత ప్లాన్డుగా దెబ్బకొట్టారా ?tdp chandrababu kodela sattenapalli{#}vijayalakshmi;Kodela Siva Prasada Rao;narasaraopet;Kanna Lakshminarayana;CBN;Party;FatherSun, 04 Jun 2023 03:00:00 GMT

చాలా వ్యూహాత్మకంగా కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని చంద్రబాబునాయుడు దెబ్బకొట్టేశారు. సత్తెనపల్లిలో ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించటం ద్వారా చంద్రబాబు ఈపనిచేశారు. స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ను చంద్రబాబుతో పాటు ఇతర తమ్ముళ్ళు దారుణంగా అవమానించారు. పార్టీపరంగానే కాకుండా సామాజికవర్గంలో కూడా అవమానాలు ఎదురయ్యాయి. కలిసి మాట్లాడాలని కోడెల ప్రయత్నిస్తే చంద్రబాబు దగ్గరకు రానీయలేదు. పార్టీ ఆఫీసుకు వెళితే నేతలంతా బయటకు వెళ్ళిపోయేవారు.





ఇక సామాజికవర్గంలో కూడా చాలామంది దూరంగా పెట్టేశారు. ఈ అవమానాలను తట్టుకోలేక కోడెల ఆత్మహత్యచేసుకున్నారు. అప్పటినుండి కోడెల కుటుంబానికి పార్టీకి సంబంధాలు దాదాపు తెగిపోయినట్లే అనుకోవాలి. తండ్రి వారసుడిగా తనకే సత్తెనపల్లిలో ఇన్చార్జిస్తారని, టికెట్ ఇస్తారని కొడుకు కోడెల శివరామ్ అనుకోవటమే తప్పు. తండ్రినే దూరంపెట్టేసిన చంద్రబాబు కొడుకును ఎందుకు దగ్గరకు తీసుకుంటారు ? శివరామ్ తో పాటు ఇన్చార్జి పదవికోసం పోటీపడుతున్న మరో ముగ్గురిని కాదని సడెన్ గా కన్నాను ఇన్చార్జి చేయటంలోనే వ్యూహముంది.





కన్నాను ఇన్చార్జిగా చేస్తే శివరామ్ తిరగబడతాడని చంద్రబాబుకు బాగా తెలుసు. తెలిసే కన్నాను నియమించారు. అయితే శివరామ్ కూడా చేసేదేమీలేదు. ఎందుకంటే చిన్నకోడెల ట్రాక్ రికార్డు కూడా చాలా చెత్తగా ఉంది. తండ్రి పదవిని అడ్డంపెట్టుకుని శివరామ్ తో పాటు అతని సోదరి విజయలక్ష్మి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో చాలా అరాచకాలకు పాల్పడ్డారు. దాంతో పార్టీమొత్తం వ్యతిరేకమైపోయింది. పోనీ మిగిలిన వాళ్ళేమన్నా గట్టోళ్ళా అంటే అదీకాదు





ఇంత బ్యాడ్ ట్రాక్ రికార్డు పెట్టుకున్న శివరామ్ ఇపుడు చేయగలిగేది కూడా ఏమీలేదు. ఉంటే పార్టీలో ఉండి కన్నాకు పనిచేయాలి లేకపోతే పార్టీలో నుండి బయటకు రావాలి. పార్టీలోనే ఉంటే మర్యాదుండదు, పార్టీ బయటకు వస్తే ఏపార్టీలోను చేరలేరు. ఈ విషయాలన్నింటినీ భేరీజు వేసుకున్న తర్వాత కోడెల ఫ్యామిలీని దెబ్బకొట్టేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. కాబట్టి ఇపుడు శివరామ్ చేయగలిగింది కూడా ఏమీలేదు. తాజా డెవలప్మంట్లతో అందరికీ అర్ధమైపోయింది.






RRR Telugu Movie Review Rating

అమరావతి : ఇంత ప్లాన్డుగా దెబ్బకొట్టారా ?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>