Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/warnere663fe6a-3d8f-4141-9ca3-46181321614f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/warnere663fe6a-3d8f-4141-9ca3-46181321614f-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించాడు అన్న విషయం తెలిసిందే. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఎప్పుడూ మంచి ప్రదర్శనలు చేస్తూ ఉంటాడు.. ఇక మూడు ఫార్మాట్లలో కూడా సత్తా చాటుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా ఆస్ట్రేలియా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించడం మాత్రమే కాదు.. అటు ఐపిఎల్ లో కూడా వివిధ జట్ల తరఫున ఎంతోమంది భారత క్రికెట్ ప్రేక్షకులను కూడా తన అభిమానులుగా మార్చుకున్నాడు డేవిడ్ వార్నర్. అయితే గత కొంతకాలం నుంచి డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ గురించి కWarner{#}Cricket;Australia;INTERNATIONAL;June;ICC T20;Pakistan;Newsరిటైర్మెంట్ పై.. షాకింగ్ ప్రకటన చేసిన స్టార్ క్రికెటర్?రిటైర్మెంట్ పై.. షాకింగ్ ప్రకటన చేసిన స్టార్ క్రికెటర్?Warner{#}Cricket;Australia;INTERNATIONAL;June;ICC T20;Pakistan;NewsSun, 04 Jun 2023 09:40:00 GMTఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించాడు అన్న విషయం తెలిసిందే. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఎప్పుడూ మంచి ప్రదర్శనలు చేస్తూ ఉంటాడు.. ఇక మూడు ఫార్మాట్లలో కూడా సత్తా చాటుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా ఆస్ట్రేలియా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించడం మాత్రమే కాదు.. అటు ఐపిఎల్ లో కూడా వివిధ జట్ల తరఫున ఎంతోమంది భారత క్రికెట్ ప్రేక్షకులను కూడా తన అభిమానులుగా మార్చుకున్నాడు డేవిడ్ వార్నర్. అయితే గత కొంతకాలం నుంచి డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ గురించి కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదు అంటూ గతంలో  వార్నర్ చెప్పుకొచ్చాడు.



 కానీ ఇటీవలే తన రిటైర్మెంట్ గురించి ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. 2024 జనవరిలో తన సొంత మైదానమైన సిడ్నీలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఇక ఈ మ్యాచ్ పాకిస్తాన్ తో జరగనుంది. ఇక ప్రస్తుతం జూన్ 7వ తేదీ నుంచి ఓవల్ వేదికగా జరగబోయే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వార్నర్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో 2024 టీ20 వరల్డ్ కప్ తనకు  ఆస్ట్రేలియా తరఫున చివరి టోర్నీ అవుతుంది  ప్రకటన చేశాడు అని చెప్పాలి .



 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు వరకు 103 టెస్టులు ఆడాడు ఇందులో 25 శతకాలు 34 అర్ధ శతకాలు ఉన్నాయి. 142 వన్డే మ్యాచ్లు ఆడగా.  19 సెంచరీలు 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 99 టి20 మ్యాచ్ ఆడగా.. ఒక సెంచరీ తో పాటు 24 అర్థ సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే 36 ఏళ్ల డేవిడ్ వార్నర్ ఇటీవల కాలంలో టెస్ట్ ఫార్మాట్లో పెద్దగా రాణించడం లేదు. రెండేళ్ల వ్యవధిలో అతను  ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం అతను పర్వాలేదనిపిస్తున్నాడు. ఇటీవల 2023 ఐపీఎల్ లో కూడా మంచి ప్రదర్శన చేశాడు.



RRR Telugu Movie Review Rating

వాటికీ భయపడి ఇండస్ట్రీని వదిలేసినా సోనమ్ బజ్వా....!!

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>