Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ottf574f4d1-1f5e-442d-a4f1-8198d75ada3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ottf574f4d1-1f5e-442d-a4f1-8198d75ada3c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఓటీటి ప్లాట్ఫార్మ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఆ తర్వాత చాలా రోజులకి ఇక నేరుగా టెలివిజన్ ఛానల్లోనే ప్రసారం అయ్యేవి. కానీ ఓటిటి వచ్చిన తర్వాత మాత్రం ఈ పంతా పూర్తిగా మారిపోయింది. అటు థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు కేవలం వారాల వ్యవధిలోని ఓటీటి ప్లాట్ ఫామ్ లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఓటీటిలో డౌన్లోడ్ చేసుకుని తమకు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ప్రేక్షకులు వీక్షించే అవకాశం కూడOtt{#}bollywood;Telugu;television;Audience;Coffee;Cinemaఅంతా రివర్స్.. ముందు ఓటీటిలో.. ఆ తర్వాత థియేటర్లలో?అంతా రివర్స్.. ముందు ఓటీటిలో.. ఆ తర్వాత థియేటర్లలో?Ott{#}bollywood;Telugu;television;Audience;Coffee;CinemaSat, 03 Jun 2023 08:00:00 GMTప్రస్తుతం ఓటీటి ప్లాట్ఫార్మ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఆ తర్వాత చాలా రోజులకి ఇక నేరుగా టెలివిజన్ ఛానల్లోనే ప్రసారం  అయ్యేవి. కానీ ఓటిటి వచ్చిన తర్వాత మాత్రం ఈ పంతా పూర్తిగా మారిపోయింది. అటు థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు  కేవలం వారాల వ్యవధిలోని ఓటీటి ప్లాట్ ఫామ్ లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఓటీటిలో డౌన్లోడ్ చేసుకుని తమకు  ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ప్రేక్షకులు వీక్షించే అవకాశం కూడా వచ్చింది.



 దీంతో ఇలా ఓటీటి ట్రెండుకి బాగా అలవాటు పడిపోయారు సినీ ప్రేక్షకులు. దీంతో సినిమాలను థియేటర్లలో చూడలేకపోయిన వారు ఓటిటిలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు ఇలా థియేటర్లలో విడుదలైన సినిమాలు మళ్ళీ ఓటీటిలో రిలీజ్ అవ్వడం చూసాము. కానీ ఇక్కడ ఒక సినిమా విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ అయింది. మొదట ఆ సినిమా ఓటీటిలో రిలీజ్ అయింది. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధం అవుతుంది ఆ సినిమా.



 ఆ సినిమా ఏదో కాదు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ నటించిన సిర్ఫ్ ఏక బంధ కాఫీ హై మూవీ. అయితే ఈ సినిమా మొదట ఓటీటిలో విడుదలైంది. ఇక ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. అయితే థియేటర్లలో ఓటీటిలో కూడా ఒకే రీతిలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ. అయితే ఈ సినిమానే కాదు గతంలో కూడా ఒక తెలుగు సినిమా విషయంలో ఇదే జరిగింది. అదే కలర్ ఫొటో సినిమా.  మొదట ఓటీటిలో రిలీజ్ అయిన తర్వాత మళ్లీ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. అయినప్పటికీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా.



RRR Telugu Movie Review Rating

అమరావతి చంద్రబాబుకు బీసీల షాక్ ఖాయమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>