Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickrt1f563804-0af6-4226-9bbc-3efe734d98a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crickrt1f563804-0af6-4226-9bbc-3efe734d98a9-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎంతో అద్భుతమైన ప్రదర్శనలతో అంతర్జాతీయ క్రికెట్లో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది. ప్రత్యర్థి ఎంత మెరుగైన జట్టు అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తమ వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేస్తూనే ఉంది అని చెప్పాలి. కేవలం సొంత గడ్డపై మాత్రమే కాదు ఇక విదేశీ పర్యటనలకు వెళ్ళిన సమయంలోనూ ఇదే రీతిలో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. దీంతో ఆఫ్గనిస్తాన్ టీం ప్రదర్శన గత కొంతకాలం నుంచి ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. బౌలింగ్లో బ్యాటింగ్ లో ఫీలCrickrt{#}Cricket;Afghanistan;Sri Lanka;INTERNATIONALచరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. క్రికెట్ హిస్టరీలో మొదటిసారి?చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. క్రికెట్ హిస్టరీలో మొదటిసారి?Crickrt{#}Cricket;Afghanistan;Sri Lanka;INTERNATIONALSat, 03 Jun 2023 07:30:00 GMTఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎంతో అద్భుతమైన ప్రదర్శనలతో అంతర్జాతీయ క్రికెట్లో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది. ప్రత్యర్థి ఎంత మెరుగైన జట్టు అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తమ వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేస్తూనే ఉంది అని చెప్పాలి. కేవలం సొంత గడ్డపై మాత్రమే కాదు ఇక విదేశీ పర్యటనలకు వెళ్ళిన సమయంలోనూ ఇదే రీతిలో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. దీంతో ఆఫ్గనిస్తాన్ టీం ప్రదర్శన గత కొంతకాలం నుంచి ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.


 బౌలింగ్లో బ్యాటింగ్ లో ఫీల్డింగ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూ ఉంది. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లందరూ ఆఫ్ఘనిస్తాన్ జట్టులోనే ఉన్నారేమో అనేట్లుగా ఆ జట్టు ప్రదర్శన కొనసాగుతుంది అని చెప్పాలి. మరోసారి ఒక అద్భుతమైన విజయం సాధించి అరుదైన రికార్డును సృష్టించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అటు శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ వన్డే సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్ళింది ఆఫ్గనిస్తాన్. అయితే సొంత గడ్డపై శ్రీలంకను ఓడించడం కష్టమని అంచనా వేశారు క్రికెట్ విశ్లేషకులు.


 క్రికెట్ విశ్లేషకుల అంచనాను తలకిందులు చేస్తూ ఇక మొదటి మ్యాచ్ లోనే ఆఫ్గనిస్తాన్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఒక రికార్డు సృష్టించింది. టాప్ 10 జట్టు పై అత్యధిక పరుగులు చేదించిన టీం గా నిలిచింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో లంక 268 పరుగులు చేసింది. ఇక  ఆఫ్గనిస్తాన్ 46.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. అయితే టాప్ టెన్ లో ఉన్న జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ ఇంత భారీ లక్ష్యాన్ని చేదించడం ఇదే తొలిసారి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ 8వ స్థానంలో శ్రీలంక తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

అమరావతి చంద్రబాబుకు బీసీల షాక్ ఖాయమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>