MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgవ్యాపారాలలో సినిమా రంగంలో ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ మాటలలో తేడాలు వస్తే ఆమాట ఇచ్చిన వ్యక్తి పై విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో తేడా వస్తే ఆవ్యక్తిని విపరీతంగా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు దర్శకుడు పరుశు రామ్ పరిస్థితి అలాగే ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.‘గీత గోవిందం’ ఘన విజయం తరువాత పరుశు రామ్ పేరు మారుమ్రోగి పోవడంతో చాలామంది నిర్మాతలు పరుశు రామ్ తో సినిమాలు తీయడానికి ఆశక్తి కనపరిచారు. దీనికి సంబందించి అడ్వాన్స్ లు కూడ పరుశు రామ్ కు భారీగా ఇచ్చారు అన్న ప్రచారం PARUSURAAM{#}ram pothineni;producer;Producer;Allu Aravind;Athadu;Darsakudu;Cinema;Directorపరుశు రామ్ ఎందుకు ఇలా ?పరుశు రామ్ ఎందుకు ఇలా ?PARUSURAAM{#}ram pothineni;producer;Producer;Allu Aravind;Athadu;Darsakudu;Cinema;DirectorSat, 03 Jun 2023 10:00:00 GMTవ్యాపారాలలో సినిమా రంగంలో ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ మాటలలో తేడాలు వస్తే ఆమాట ఇచ్చిన వ్యక్తి పై విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో తేడా వస్తే ఆవ్యక్తిని విపరీతంగా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు దర్శకుడు పరుశు రామ్ పరిస్థితి అలాగే ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


‘గీత గోవిందం’ ఘన విజయం తరువాత పరుశు రామ్ పేరు మారుమ్రోగి పోవడంతో చాలామంది నిర్మాతలు పరుశు రామ్ తో సినిమాలు తీయడానికి ఆశక్తి కనపరిచారు. దీనికి సంబందించి అడ్వాన్స్ లు కూడ పరుశు రామ్ కు భారీగా ఇచ్చారు అన్న ప్రచారం ఉంది. అయితే పరుశు రామ్ తాను సినిమా తీస్తే టాప్ హీరోతో మాత్రమే స్సినిమా తీస్తాను అన్న పట్టుదలతో ఉండటంతో పరుశు రామ్ నుండి మరో సినిమా రావడానికి చాల ఆలస్యం అయింది.


మహేష్ ను ఎదో విధంగా ఒప్పించి ‘సర్కారు వారి పాట’ మూవీ తీసినప్పటికీ ఆమూవీ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడంతో పరుశు రామ్ ఆశలు నీరు కారి పోయాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పరుశు రామ్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడంతో అతడి పరిస్థితి మరింత అయోమయంగా తయారయింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు కథలు చెపుతాను అని లీకులు ఇస్తున్నప్పటికీ అతడు చెప్పే కథలను వినడానికి చాలామంది హీరోలు ఆశక్తి కనపరచడం లేదు అన్న ప్రచారం కూడ ఉంది.


రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు ఎప్పుడో తాను నిర్మాత కెఎల్ నారాయణకు ఇచ్చిన మాట నిలుపు కోవడానికి మహేష్ తో భారీ సినిమాను తీస్తూ ఉంటే మీడియం రేంజ్ దర్శకుడు స్థాయిలో ఉన్న పరుశు రామ్ తాను నిర్మాతలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలుపుకోలేక పోతున్నాడు అని కొందరు అతడిని టార్గెట్ చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ వల్ల అతడి కెరియర్ కు సమస్యలు వచ్చే ఆవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు..  





RRR Telugu Movie Review Rating

అఖిల్ నెక్స్ట్ మూవీ ఆ జోనర్లో..?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>