Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jersey3a540110-939c-4194-9fb0-d2258771faad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jersey3a540110-939c-4194-9fb0-d2258771faad-415x250-IndiaHerald.jpgటీమిండియా మరికొన్ని రోజుల్లో డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది . ఈ క్రమంలోనే ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం సెలెక్ట్ అయిన ఆటగాళ్లు అందరూ కూడా లండన్ ఫ్లైట్ ఎక్కేసారు. ఇక అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగబోతుంది. టీమిండియా కిట్ స్పాన్సర్ ఎంపిఎల్ అర్ధాంతరంగా కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవడంతో ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ తో ఒప్పందం చేసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో కొత్త జెర్సీ తోనే అటు Jersey{#}New Zealand;Hanu Raghavapudi;london;Jersey;World Cup;contract;Qualification;ICC T20;England;Indiaటీమిండియా కొత్త జెర్సీ.. ఫ్యాన్స్ ని భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్?టీమిండియా కొత్త జెర్సీ.. ఫ్యాన్స్ ని భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్?Jersey{#}New Zealand;Hanu Raghavapudi;london;Jersey;World Cup;contract;Qualification;ICC T20;England;IndiaSat, 03 Jun 2023 12:00:00 GMTటీమిండియా మరికొన్ని రోజుల్లో డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది . ఈ క్రమంలోనే ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం సెలెక్ట్ అయిన ఆటగాళ్లు అందరూ కూడా లండన్ ఫ్లైట్ ఎక్కేసారు. ఇక అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగబోతుంది. టీమిండియా కిట్ స్పాన్సర్ ఎంపిఎల్ అర్ధాంతరంగా కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవడంతో ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ తో ఒప్పందం చేసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో కొత్త జెర్సీ తోనే అటు టీమిండియ ఆటగాళ్ళు కనిపించబోతున్నారు.



 అయితే ఇప్పుడు ఇదే విషయంపై అటు టీమిండియా ఫ్యాన్స్ అందరూ మాత్రం ఆందోళన చెందుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే జెర్సీ మారిన ప్రతిసారి కూడా టీమిండియా కి పరాభావమే ఎదురవుతూ వచ్చింది. 2019 వన్డే వరల్డ్ కప్ కి ముందు కొత్త జెర్సీతో ఇంగ్లాండ్ పయనం అయింది భారత జట్టు. అయితే గ్రూప్ స్టేజిలో టేబుల్ టాపర్గా నిలిచిన టీమిండియా అటు సెమీఫైనల్ లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి చివరికి తీవ్రంగా నిరాశపరిచింది. ఇక 2021 టీ20 ప్రపంచ కప్ లోను ఇదే సీన్ రిపీట్ అయింది. కనీసం నాకౌట్ స్టేజ్ కి కూడా అర్హత సాధించలేకపోయింది.



 అయితే ఇలా టి20 వరల్డ్ కప్ లో పరాభవం తర్వాత అటు టీమిండియా జెర్సీలో మళ్ళీ మార్పు చేశారు. 2022 టీ20 వరల్డ్ కప్ కి కూడా కొత్త జెర్సీ తోనే బరిలోకి దిగింది భారత జట్టు. అక్కడ సేమ్ సేమ్ రిపీట్ అయ్యింది.  గ్రూప్ స్టేజిలో బాగా రాణించిన టీమ్ ఇండియా.. సెమి ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలు అయింది. ఇక ఇప్పుడు మరోసారి కొత్త జెర్సీతో టీమ్ ఇండియా బరిలోకి దిగుతుంది. దీంతో మళ్ళీ జట్టుకు ఓటమి తప్పదేమో బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.



RRR Telugu Movie Review Rating

అజిత్ పక్కన ఉన్న ఈ బక్క పల్చని కుర్రాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్?

భారత్‌ గ్రేట్.. తెగపొగుతున్న పాకిస్తానీలు?

అమెరికా.. ఆ దేశాన్ని మరో ఉక్రెయిన్ చేస్తుందా?

ఛాట్‌ జీపీటీ: టెక్నాలజీ మనల్ని ముంచేస్తుందా?

అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>