MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb0f5ff03-91f4-4e3d-826d-a4008c2747c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb0f5ff03-91f4-4e3d-826d-a4008c2747c7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల గత చిత్రాలు మరోసారి థియేటర్స్లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో బాగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఓ అగ్ర హీరో సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' మూవీ రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. 4k డాల్బీ అట్మాస్ వెర్షన్ లో రోబో మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడ tollywood{#}Dilip Kumar;Rajani kanth;Kollywood;June;Darsakudu;Success;India;Ram Charan Teja;shankar;Director;Tollywood;Hero;Cinemaరీ రిలీజ్ కి రెడీ అయిన రజినీకాంత్ రోబో.. థియేటర్స్ లో మాత్రం కాదు..?రీ రిలీజ్ కి రెడీ అయిన రజినీకాంత్ రోబో.. థియేటర్స్ లో మాత్రం కాదు..?tollywood{#}Dilip Kumar;Rajani kanth;Kollywood;June;Darsakudu;Success;India;Ram Charan Teja;shankar;Director;Tollywood;Hero;CinemaFri, 02 Jun 2023 15:40:00 GMTప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల గత చిత్రాలు మరోసారి థియేటర్స్లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో బాగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఓ అగ్ర హీరో సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' మూవీ రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. 4k డాల్బీ అట్మాస్ వెర్షన్ లో రోబో మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోబో 4k డాల్బీ అట్మాస్ వెర్షన్ను థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారట. 

అంతేకాదు జూన్ 9వ తేదీ నుంచి ఈ కొత్త వెర్షన్ సన్ నెక్స్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. 2010లో శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ గా నిలిచింది. సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 320 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. భారీ కమర్షియల్ సక్సెస్ తో పాటు ఏకంగా రెండు నేషనల్ అవార్డులను సైతం గెలుచుకుంది. 'ఎంథిరన్' పేరుతో తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ 'రోబో' అనే పేరుతో తెలుగులో అనువాదమై సంచలన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో రజనీకాంత్ సైంటిస్ట్ గా రోబో గా డ్యూయల్ రోల్ లో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమాలో రోబో గా ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా రోబో 2.0 మూవీని తెరకెక్కించాడు శంకర్. కానీ ఈ సీక్వెల్ అనుకున్న రీతిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అటు దర్శకుడు శంకర్ రామ్ చరణ్ తో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.



RRR Telugu Movie Review Rating

రీ రిలీజ్ కి రెడీ అయిన రజినీకాంత్ రోబో.. థియేటర్స్ లో మాత్రం కాదు..?

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>