Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6cc19580-be4f-4a77-94e7-da3af3cdb50b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6cc19580-be4f-4a77-94e7-da3af3cdb50b-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పే పని లేదు., ఆయన గురించి అందరికీ కూడా తెలిసిందే.ఇతర హీరోలకు ఎవ్వరికి కూడా సాధ్యపడని క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ అతని సొంతం. మిగిలిన హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో సినిమాలు సెట్ చేసుకొని మరీ భారీ ఓపెనింగ్స్ మరియు మార్కెట్ ని తెచ్చుకుంటుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఊరు పేరు తెలియని డైరెక్టర్స్ తో సినిమాలు చేసి ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతూ ఉంటాడు.అందుకు రీసెంట్ ఉదాహరణ ఆయన నటిస్తున్న '#OG' చిత్రమే, ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ సsocialstars lifestyle{#}Salman Khan;Shahrukh Khan;Remake;vegetable market;Chitram;sujeeth;Pawan Kalyan;Hindi;raja;bollywood;India;Audience;kalyan;producer;Producer;Hero;Telugu;Cinemaరెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గేది లేదంటన్న పవన్...!!రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గేది లేదంటన్న పవన్...!!socialstars lifestyle{#}Salman Khan;Shahrukh Khan;Remake;vegetable market;Chitram;sujeeth;Pawan Kalyan;Hindi;raja;bollywood;India;Audience;kalyan;producer;Producer;Hero;Telugu;CinemaFri, 02 Jun 2023 11:39:52 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పే పని లేదు., ఆయన గురించి అందరికీ కూడా తెలిసిందే.ఇతర హీరోలకు ఎవ్వరికి కూడా సాధ్యపడని క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ అతని సొంతం.

మిగిలిన హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో సినిమాలు సెట్ చేసుకొని మరీ భారీ ఓపెనింగ్స్ మరియు మార్కెట్ ని తెచ్చుకుంటుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఊరు పేరు తెలియని డైరెక్టర్స్ తో సినిమాలు చేసి ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతూ ఉంటాడు.అందుకు రీసెంట్ ఉదాహరణ ఆయన నటిస్తున్న '#OG' చిత్రమే, ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నాడని సమాచారం.. రన్ రాజా రన్  మరియు 'సాహూ' వంటి చిత్రాలను తెరకెక్కించిన సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సుజిత్ తీసిన ఈ రెండు సినిమాలో 'రన్ రాజా రన్' అనే చిత్రం ఒక్కటే సూపర్ హిట్ గా నిల్చింది. సాహూ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యిందనే విషయం మన అందరికీ తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత రీమేక్ కాకుండా, ఒక స్ట్రెయిట్ సబ్జెక్టు తో పాన్ ఇండియా సినిమా చెయ్యడం, దానికి తోడు ఇండియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న యాక్షన్ జానర్ లో ఆయన నటించడం తో ఈ సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు  కూడా మామూలు రేంజ్ లో లేవు. ఇందులో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ మరియు ఆయన లుక్ ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేసే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది..భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం తో ఈ పవన్ కళ్యాణ్ కి వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని నిర్మాత డీవీవీ దానయ్య ఇస్తున్నట్టు గా సమాచారం. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యలేదు. ఆయన చేసినవి కేవలం ప్రాంతీయ బాషా చిత్రాలు మాత్రమే. అలాంటిది పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవడం ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. బాలీవుడ్ హీరోలకు కేవలం హిందీ లో తప్ప మరో భాషలో మార్కెట్ అయితే లేదు,అందుకే ఆ హీరోలకు అక్కడి మార్కెట్ ని బట్టి రెమ్యూనరేషన్స్ ను ఇస్తుంటారు నిర్మాతలు. సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ మాత్రమే వంద కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ తర్వాత కేవలం తెలుగు మార్కెట్ తో వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఏకైక హీరో గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించాడు



RRR Telugu Movie Review Rating

పవన్ రిజెక్ట్ చేసిన సినిమాతో.. మహేష్ కు డిజాస్టర్?

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>