Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle07e39207-cf85-4a5c-a102-85928727efc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle07e39207-cf85-4a5c-a102-85928727efc6-415x250-IndiaHerald.jpgసీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేననే విషయం తెలిసిందే. అటు సినిమా హీరోగా, ఇటు రాజకీయ నాయకునిగా సీనియర్ ఎన్టీఆర్ సంచలనము సృష్టించారు. ఏ పాత్ర పోషించినా కూడా ఆ పాత్రలో తనకంటే అద్భుతంగా ఎవరూ నటించలేరు అనేలా ఎన్టీఆర్ నటించేవారు. సీనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానులలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఒకరు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి షాకింగ్ విషయాలను అయితే వెల్లడించారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంత వరకు సీనsocialstars lifestyle{#}rajendra prasad;babu rajendra prasad;gold;Manam;NTR;Success;Cinemaఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజేంద్ర ప్రసాద్..!!ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజేంద్ర ప్రసాద్..!!socialstars lifestyle{#}rajendra prasad;babu rajendra prasad;gold;Manam;NTR;Success;CinemaTue, 30 May 2023 10:55:22 GMTసీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేననే విషయం తెలిసిందే. అటు సినిమా హీరోగా, ఇటు రాజకీయ నాయకుని గా సీనియర్ ఎన్టీఆర్ సంచలనము సృష్టించారు.

ఏ పాత్ర పోషించి నా కూడా ఆ పాత్ర లో తన కంటే అద్భుతంగా ఎవరూ నటించలేరు అనేలా ఎన్టీఆర్ నటించేవారు. సీనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానుల లో రాజేంద్ర ప్రసాద్  కూడా ఒకరు.

ఎన్టీఆర్ శతజయంతి  సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి షాకింగ్ విషయాల ను  అయితే వెల్లడించారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంత వరకు సీనియర్ ఎన్టీఆర్ చెరిగిపోని జ్ఞాపకం అని కూడా తెలిపారు. పూర్వజన్మ సుకృతం వల్ల సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన గడ్డపైనే నేను పుట్టానని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారటా.. సీనియర్ ఎన్టీఆర్ కు దగ్గరగా ఉండే గొప్ప అవకాశం నాకు దక్కిందని కూడా ఆయన వెల్లడించారు.

నా తల్లీదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల ఈ అదృష్టం దక్కిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారటా.తెలుగువాడిగా ఎన్టీఆర్ పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అని కూడా ఆయన తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ చేసిన కార్యక్రమాల ను మనం స్మరణం చేసుకోవాలని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ జీవించి ఉంటే బంగారు పూలతో పాదపూజ ను చేసేవాడినని ఆయన పేర్కొన్నారు.

నేను కెరీర్ పరం గా సక్సెస్ కావడానికి ఎన్టీఆర్ కూడా ఒక కారణమని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎంతోమంది కి సినిమాల కు సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ సహాయం చేశారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలను ఎన్టీఆర్ దేవుళ్లుగా భావించారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎవరైనా కులం గురించి మాట్లాడితే సీనియర్ ఎన్టీఆర్ కోప్పడేవారని కులాలకు మరియు మతాల గురించి ఆయన అస్సలు పట్టించుకునే వారు కాదని ఆయన అందరివాడని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.



RRR Telugu Movie Review Rating

ఆకట్టుకుంటున్న" రామ్ సీతారామ్" పాట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>