MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan1270ad65-c2b3-40f1-956f-e43fa7881451-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan1270ad65-c2b3-40f1-956f-e43fa7881451-415x250-IndiaHerald.jpg‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. చరణ్ సినిమాలలో నటిస్తూనే కొణిదల ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి ‘సైరా’ ‘గాడ్ ఫాదర్’ ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈసినిమాలలో ఒక్క ‘వాల్తేర్ వీరయ్య’ తప్ప మిగతా రెండు సినిమాలు చరణ్ కు పెద్దగా కలిసిరాలేదు.అయితే ఇప్పుడు చరణ్ మరొక ప్రముఖ వ్యక్తిని భాగస్వామిగా చేసుకుని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాramcharan{#}Chiranjeevi;Ram Charan Teja;vikram;INTERNATIONAL;House;Father;UV Creations;Tollywood;Cinemaచరణ్ నిర్ణయం పై ఆశక్తికర చర్చలు !చరణ్ నిర్ణయం పై ఆశక్తికర చర్చలు !ramcharan{#}Chiranjeevi;Ram Charan Teja;vikram;INTERNATIONAL;House;Father;UV Creations;Tollywood;CinemaMon, 29 May 2023 08:00:00 GMT‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. చరణ్ సినిమాలలో నటిస్తూనే కొణిదల ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి ‘సైరా’ ‘గాడ్ ఫాదర్’ ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈసినిమాలలో ఒక్క ‘వాల్తేర్ వీరయ్య’ తప్ప మిగతా రెండు సినిమాలు చరణ్ కు పెద్దగా కలిసిరాలేదు.


అయితే ఇప్పుడు చరణ్ మరొక ప్రముఖ వ్యక్తిని భాగస్వామిగా చేసుకుని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో భాగస్వామిగా కొనసాగుతున్న విక్రమ్ తో కలిసి చరణ్ ‘’వి మెగా పిక్చర్స్’ అన్న నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.


వాస్తవానికి చరణ్ కు ఒక సొంత నిర్మాణ సంస్థ ఉండగా మరో వ్యక్తితో కలిసి కొత్త నిర్మాణ సంస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటూ చాలమంది సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం చరణ్ తీసుకున్న ఈనిర్ణయం వెనుక అతడి తండ్రి చిరంజీవి సలాహాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత చరణ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోవడంతో సినిమా నిర్మాణం పై ఎక్కువగా మనసు పెట్టకుండా తన కెరియర్ పై మరీ ముఖ్యంగా సినిమాల కథల ఎంపిక పై దృష్టి పెట్టమని చిరంజీవి సలహా ఇవ్వడంతో చరణ్ విక్రమ్ తో కలిసి ఈకొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించాడు అన్నప్రచారం జరుగుతోంది.


విక్రమ్ కు సినిమా నిర్మాణ రంగంలో విపరీతమైన అనుభవం ఉండటంతో తన ఇమేజ్ అదేవిధంగా తన కుటుంబ పరపతి విక్రమ్ కు జత చేస్తే తన నిర్మాణ సంస్థ అతితక్కువ కాలంలో నెంబర్ వన్ నిర్మాణ సంస్థగా మారుతుందని చరణ్ అంచనా అని అంటున్నారు. మెగా ఫ్యామిలీలో అనేకమంది యంగ్ హీరోలు ఉండటంతో వరసపెట్టి మీడియం రేంజ్ చిన్న సినిమాలు తీసే ఉదేశ్యం చరణ్ కు ఉంది అన్న ప్రచారం కూడ జరుగుతోంది..  







RRR Telugu Movie Review Rating

అమెరికా : అమెరికాలో దీపావళికి సెలవు ? భారతీయుల ప్రభావం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>