Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vilan-nundi-heroes-ga-marina-tollywood-stars-fcafb920-a34c-48d0-8b13-493c6f82fe13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vilan-nundi-heroes-ga-marina-tollywood-stars-fcafb920-a34c-48d0-8b13-493c6f82fe13-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మీ ఫెవరేట్ హీరో ఎవరు అని అడిగితే ఎక్కువశాతం చెప్పే పేరు చిరంజీవి. ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన చిరు.. కెరీర్ మొదట్లో అనేక సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. కమల్‌హాసన్, జయసుధ జంటగా నటించిన ‘ఇది కథ కాదు’.. శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా కలసి నటించిన ‘మోసగాడు’, ’47 రోజులు’, ‘న్యాయం కావాలి’, ‘తిరుగులేని మనిషి’ చిత్రాలలో విలన్ గా నటించాడు. గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పడంలో ఈయన స్పెషలిస్ట్ అన్న విషయం తెలిసిందే. ‘స్వర్గం నరకం’ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన మోSocialstars lifestyle {#}dr rajasekhar;editor mohan;jayasudha;mohan babu;teja;king;King;Success;Hero;Kannada;Rajani kanth;Chiranjeevi;Sridevi Kapoorవిలన్ నుండి హీరోస్ గా మారిన టాలీవుడ్ స్టార్స్....!!విలన్ నుండి హీరోస్ గా మారిన టాలీవుడ్ స్టార్స్....!!Socialstars lifestyle {#}dr rajasekhar;editor mohan;jayasudha;mohan babu;teja;king;King;Success;Hero;Kannada;Rajani kanth;Chiranjeevi;Sridevi KapoorMon, 29 May 2023 08:23:00 GMTటాలీవుడ్ లో మీ ఫెవరేట్ హీరో ఎవరు అని అడిగితే ఎక్కువశాతం చెప్పే పేరు చిరంజీవి. ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన చిరు.. కెరీర్ మొదట్లో  అనేక సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు. కమల్‌హాసన్, జయసుధ జంటగా నటించిన ‘ఇది కథ కాదు’.. శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా కలసి నటించిన ‘మోసగాడు’, ’47 రోజులు’, ‘న్యాయం కావాలి’, ‘తిరుగులేని మనిషి’ చిత్రాలలో విలన్ గా నటించాడు.

గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పడంలో ఈయన స్పెషలిస్ట్ అన్న విషయం తెలిసిందే. ‘స్వర్గం నరకం’ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన మోహన్ బాబు ఇప్పటికి 500 పైగా చిత్రాలలో నటించాడు. వాటిల్లో హీరో, విలన్ మరియు సపోర్టింగ్ రోల్స్ ఉన్నాయి. చిరంజీవి బాటలోనే మోహన్ బాబు కూడా ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించాడు. అసలు ఒకానొక టైంలో విలనిజానికి మారుపేరు అయ్యాడు మోహన్ బాబు. దాదాపుగా 200 పైగా సినిమాలలో విలన్ రోల్ చేసి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తరువాత పరిపూర్ణమైన హీరోగా, డైలాగ్ కింగ్ గా కొనసాగుతున్నాడు.

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగి కోట్లాది మంది అభిమానులను ఏర్పరచుకున్న రజినీకాంత్ కెరీర్ మొదట్లో అనేక కన్నడ సినిమాలలో విలన్ రోల్స్ చేశాడు. వాటిల్లో ‘కథా సంగమా’, ‘సంసార’ చిత్రాలకు మంచి పేరు లభించింది.

‘వందేమాతరం’ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన రాజశేఖర్ అతి తక్కువ టైం లోనే యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌గా గుర్తింపు పొందాడు. కెరీర్ మొదట్లో ‘తలంబ్రాలు’ సినిమాలో విలన్ గా మెప్పించిన ఆయన ఈ పాత్రకు నంది అవార్డును దక్కించుకున్నారు. ఆ తరువాత నుండి హీరోగా కొనసాగుతూ.. ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ అవుతున్నాడు.

గోపీచంద్ మొదటగా ‘తొలివలపు’ సినిమాతో సినీ అరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో హీరోగా ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో.. యూ టర్న్ తీసుకుని ప్రతినాయకుడి పాత్రలకు సై అన్నాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘జయం’ ద్వారా విలన్ అవతారం ఎత్తి ‘వర్షం’, ‘నిజం’ సినిమాలలో ప్రభాస్, మహేష్ బాబులకు ఎదురొడ్డి నిలబడ్డాడు. ఆ తరువాతి నుండి హీరోగానే కొనసాగుతున్నాడు.



RRR Telugu Movie Review Rating

అమెరికా : అమెరికాలో దీపావళికి సెలవు ? భారతీయుల ప్రభావం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>