Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-de0425b8-2e29-47d4-808f-1318514313c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-de0425b8-2e29-47d4-808f-1318514313c2-415x250-IndiaHerald.jpgఓవైపు వెండితెరపై.. మరోవైపు బుల్లితెరపై రాణిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ అదెంటంటే.. ఓ స్టార్ హీరో ఇచ్చిన రూ. 300లను ఇప్పటికీ ప్రియమణి భద్రంగా దాచుకుందట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది ప్రియమణి. ఒకప్పుడు తెలుగు తెరపై వరుస చిత్రాలతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. ఎవరే అతగాడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత పెళ్లైన కొత్తలో, హరే రామ్, గోలీమార్, శంభో శివ శంభో, యమదొంగ చిత్రాల్లో నSocialstars lifestyle {#}Deepika Padukone;Shiva;priyamani;Samantha;lord siva;Comedy;Press;Kaun Banega Crorepathi;Chennai;Hero;marriage;Teluguషారుక్ ఖాన్ మనస్తత్వం బయటపెట్టిన హీరోయిన్ ప్రియమణి....!!షారుక్ ఖాన్ మనస్తత్వం బయటపెట్టిన హీరోయిన్ ప్రియమణి....!!Socialstars lifestyle {#}Deepika Padukone;Shiva;priyamani;Samantha;lord siva;Comedy;Press;Kaun Banega Crorepathi;Chennai;Hero;marriage;TeluguMon, 29 May 2023 08:21:15 GMTఓవైపు వెండితెరపై.. మరోవైపు బుల్లితెరపై రాణిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ అదెంటంటే.. ఓ స్టార్ హీరో ఇచ్చిన రూ. 300లను ఇప్పటికీ ప్రియమణి భద్రంగా దాచుకుందట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది ప్రియమణి.

ఒకప్పుడు తెలుగు తెరపై వరుస చిత్రాలతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. ఎవరే అతగాడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత పెళ్లైన కొత్తలో, హరే రామ్, గోలీమార్, శంభో శివ శంభో, యమదొంగ చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్‏గానే కాదు.. స్పెషల్ సాంగ్స్‏లలో ఆడిపాడింది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడంతో సినిమాల్లో సహాయ పాత్రలలో నటిస్తోంది ప్రియమణి. ఓవైపు వెండితెరపై.. మరోవైపు బుల్లితెరపై రాణిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ అదెంటంటే.. ఓ స్టార్ హీరో ఇచ్చిన రూ. 300లను ఇప్పటికీ ప్రియమణి భద్రంగా దాచుకుందట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది ప్రియమణి.

హిందీలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‏తో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ప్రియమణి. ఇందులో మనోజ్ బాజ్ పేయి, సమంత కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ కంటే ముందు ఆమె.. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. యాక్షన్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో ఆమె నటించిన 1234 పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సాంగ్ కోసం ఐదు రాత్రులకు పైగా షూటింగ్ జరిగిందని.. అది చాలా గొప్ప అనుభవమని తెలిపింది.

అలాగే ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో షారుఖ్ తాను కలిసి ఐప్యాడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ చూశామని.. ఆ సమయంలో తన వద్ద ఉన్న రూ. 300 షారుఖ్ తనకు ఇచ్చాడని తెలిపింది. ఇప్పటికీ ఆ డబ్బును తాను భద్రంగా దాచుకున్నానని చెప్పుకొచ్చింది. షారుఖ్ చాలా లవ్లీ యాక్టర్ అని.. షూటింగ్ సమయంలో తన చుట్టూ ఉన్నవాళ్లంతా సంతోషంగా ఉండేలా చూస్తాడని.. అతను అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడని చెప్పుకొచ్చింది ప్రియమణి.



RRR Telugu Movie Review Rating

అమెరికా : అమెరికాలో దీపావళికి సెలవు ? భారతీయుల ప్రభావం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>