MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood72e793a4-0b29-435d-b3b9-d1bc0555be8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood72e793a4-0b29-435d-b3b9-d1bc0555be8d-415x250-IndiaHerald.jpgజూన్ నెల ఎంటర్ కావడంతో సమ్మర్ రేస్ ముగింపుకు రాబోతోంది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీతో ఈ సమ్మర్ రేస్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. ‘ఆదిపురుష్’ మూవీ విడుదలకు ఇంకా రెండు వారాలు సమయం ఉన్నప్పటికీ మీడియం రేంజ్ సినిమాలు ఏవీ విడుదలకు రెడీ కాకపోవడంతో ఈవారం కూడ చిన్న సినిమాల వార్ కొనసాగబోతోంది.ఈ శుక్రు వారం జూన్ 2న రెండు చిన్న సినిమాలు రాబోతున్నాయి. దగ్గుబాటి కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఉబలాట పడుతున్న అభిరామ్ హీరోగా తేజా దర్శకత్వంలో నిర్మించిన ‘అహింస’ తో పోటీగా బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెtollywood{#}Venkatesh;abhiram;bellamkonda sai sreenivas;Telangana;Government;Hindi;war;Daggubati Venkateswara Rao;June;Josh;News;Prabhas;Cinemaఆశక్తికరంగా మారిన తమ్ముళ్ళ వార్ !ఆశక్తికరంగా మారిన తమ్ముళ్ళ వార్ !tollywood{#}Venkatesh;abhiram;bellamkonda sai sreenivas;Telangana;Government;Hindi;war;Daggubati Venkateswara Rao;June;Josh;News;Prabhas;CinemaMon, 29 May 2023 09:00:00 GMTజూన్ నెల ఎంటర్ కావడంతో సమ్మర్ రేస్ ముగింపుకు రాబోతోంది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీతో ఈ సమ్మర్ రేస్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. ‘ఆదిపురుష్’ మూవీ విడుదలకు ఇంకా రెండు వారాలు సమయం ఉన్నప్పటికీ మీడియం రేంజ్ సినిమాలు ఏవీ విడుదలకు రెడీ కాకపోవడంతో ఈవారం కూడ చిన్న సినిమాల వార్ కొనసాగబోతోంది.


ఈ శుక్రు వారం జూన్ 2న రెండు చిన్న సినిమాలు రాబోతున్నాయి. దగ్గుబాటి కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఉబలాట పడుతున్న అభిరామ్ హీరోగా తేజా దర్శకత్వంలో నిర్మించిన ‘అహింస’ తో పోటీగా బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ విడుదల అవుతోంది.


రానా తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ‘అహింస’ మూవీతో ఈ దగ్గుబాటి వారసుడు ఎంతవరకు సెటిల్ అవుతాడు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది. బెల్లంకొండ గణేష్ సినిమాలు ఇప్పటికే కొన్ని విడుదల అయినప్పటికీ అవి పెద్దగా సక్సస్ కాకపోవడంతో ఈమూవీ ఫలితం పై గణేష్ కెరియర్ కూడ ఆధార పడిఉంది. లేటెస్ట్ గా గణేష్ సోదరుడు బెల్లంకొండ శ్రీనివాస్ వినాయక్ దర్శకత్వంలో నటించిన హిందీ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో షాక్ లో ఉన్న బెల్లంకొండ ఫ్యామిలీకి గణేష్ ఏమైనా జోష్ ను కలిగిస్తాడేమో చూడాలి.


సాధారణంగా హీరోల వారసుల సినిమాల మధ్య పోటీ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు హీరోల తమ్ముళ్ళ సినిమాల మధ్య వార్ జరుగుతోంది. ఈసినిమా విడుదల అయ్యే జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉండటంతో ఆరోజున ప్రభుత్వం సెలవు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనితో సెలవు కూడ కలిసి వచ్చే వీకెండ్ లో ఏదైనా ఒక మంచి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆసినిమాను జనం బాగా చూస్తారు. మరి ఇలాంటి అదృష్టం ఈ రెండు సినిమాలలో ఏచిన్న సినిమాకు ఉందో చూడాలి..






RRR Telugu Movie Review Rating

అమెరికా : అమెరికాలో దీపావళికి సెలవు ? భారతీయుల ప్రభావం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>