Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deathb176c1df-0a5d-488f-9dd9-5b34213e40ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deathb176c1df-0a5d-488f-9dd9-5b34213e40ee-415x250-IndiaHerald.jpgమనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుంది అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది. ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు మనుషుల ప్రాణాలను తీసేందుకు ముంచుకొస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి సడన్ హార్ట్ ఎటాక్ లు అందరిని భయపెడుతున్నాయి. ఎందుకంటే చూస్తూ చూస్తుండగానే ఎంతోమంది కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవేవీ చాలవు అన్నట్లు మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇక వారి ప్రాణాలు పోయే పరిస్థితికి కారణమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందిందే సాదరణంగా ఎండాకాలంలో ప్రతి ఇంట్లDeath{#}Husband;Heart Attack;Golconda;police;Hyderabadజర జాగ్రత్త.. కూలర్ తో ప్రాణం పోయింది?జర జాగ్రత్త.. కూలర్ తో ప్రాణం పోయింది?Death{#}Husband;Heart Attack;Golconda;police;HyderabadMon, 29 May 2023 19:45:00 GMTమనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుంది అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది. ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు మనుషుల ప్రాణాలను తీసేందుకు ముంచుకొస్తున్నాయి.  గత కొన్ని రోజుల నుంచి సడన్ హార్ట్ ఎటాక్ లు అందరిని భయపెడుతున్నాయి. ఎందుకంటే చూస్తూ చూస్తుండగానే ఎంతోమంది కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవేవీ చాలవు అన్నట్లు మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇక వారి ప్రాణాలు పోయే పరిస్థితికి కారణమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందిందే  సాదరణంగా ఎండాకాలంలో ప్రతి ఇంట్లో కూలర్ ని వినియోగించడం చేస్తూ ఉంటారు.



 కూలర్ ద్వారా వచ్చే చల్లటి గాలితో ఎంతో మంది ఎండ నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇలా చల్లటి గాలిని ఇస్తుంది అనుకున్న ఆ కూలర్ ఇక్కడ ఒక ప్రాణం పోవడానికి కారణం అయ్యింది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో జనాలు ఇక తమ స్తోమతకు తగ్గట్టుగా ఫ్యాన్లు ఏసీలు, కూలర్లు అంటూ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇక వాటి ద్వారా వచ్చే చల్లటి గాలితో ఉపశమనం పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది కూలర్లను ఇంట్లో పెట్టుకోవడం చేస్తూ ఉన్నారు.



 కానీ అదే కూలర్ చివరికి ఒక మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బడా బజారులో నివాసముండే ఆర్సియా బేగం ఇంట్లో కూలర్ వేసుకుని పడుకుంది. అయితే కూలర్ నుంచి నీళ్లు బయటకు రావడంతో చివరికి కరెంట్ షాక్కు గురైంది. చివరికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది సదరు మహిళ. అయితే ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన భర్త కూడా కరెంట్ షాక్ గురయ్యాడు. కానీ అదృష్టవశాత్తు అతను బయటపడగలిగాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

జర జాగ్రత్త.. కూలర్ తో ప్రాణం పోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>