PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu8632169a-087a-4b6d-b478-f8d4ba59a695-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu8632169a-087a-4b6d-b478-f8d4ba59a695-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్దం జరగబోతుంది. వైసీపీ లోని కౌరవ నేతలను మట్టి కరిపించి ప్రభుత్వంలోకి వస్తామని చెబుతున్నారు. పేదవాడు ధనికుడు కావడమే తమ లక్ష్యమని, రేపు ఎన్నికలు ఎప్పడూ జరిగిన గెలుస్తాం. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచుతాం. రాష్ట్రం పిచ్చోడి చేతులో రాయి అయింది. ఆ రాయిని పేదలకు తగలకుండా అడ్డు తగిలి అదే రాయితో వారితో కొట్టి తరిమేస్తాం అని అన్నారు. చంద్రబాబు ఇలా మాట్లాడిన పర్లేదు అనుకుంటున్నారు. కానీ నౌ ఆర్ నెవర్ అని అన్నారు. అంటCHANDRABABU{#}Mano;sampada;Nara Lokesh;Elections;TDP;YCP;Andhra Pradesh;CBNచంద్రబాబు నోట ఆమాట.. నైరాశ్యంలో కేడర్‌?చంద్రబాబు నోట ఆమాట.. నైరాశ్యంలో కేడర్‌?CHANDRABABU{#}Mano;sampada;Nara Lokesh;Elections;TDP;YCP;Andhra Pradesh;CBNMon, 29 May 2023 09:00:00 GMTచంద్రబాబు నాయుడు ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్దం జరగబోతుంది. వైసీపీ లోని కౌరవ నేతలను మట్టి కరిపించి ప్రభుత్వంలోకి వస్తామని చెబుతున్నారు. పేదవాడు ధనికుడు కావడమే తమ లక్ష్యమని, రేపు ఎన్నికలు ఎప్పడూ జరిగిన గెలుస్తాం. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచుతాం. రాష్ట్రం పిచ్చోడి చేతులో రాయి అయింది. ఆ రాయిని పేదలకు తగలకుండా అడ్డు తగిలి అదే రాయితో వారితో కొట్టి తరిమేస్తాం అని అన్నారు.


చంద్రబాబు ఇలా మాట్లాడిన పర్లేదు అనుకుంటున్నారు. కానీ నౌ ఆర్ నెవర్ అని అన్నారు. అంటే ఇప్పుడు గెలవకపోతే మళ్లీ ఎప్పటికీ గెలవలేం అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఇది సరైనది కాదని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2004, 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ గెలిచింది.  కేవలం అయిదేళ్లకు మాత్రమే అధికారం పరిమితం చేసుకోగలిగింది.


అసలే అధికారంలోకి రానీ బీజేపీ, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు ఎప్పుడు నౌ అర్ నెవర్ అనే పదాన్ని ఉపయోగించవు. ప్రజల్లోకి వెళతాయి. ప్రజల సమస్యలు తెలుసుకుంటాయి. ప్రజల్లో ఉంటాయి. గెలుపొటములు పట్టించుకోవు. ఎన్నికలు వచ్చినపుడు పోటీ చేస్తాయి. ఓడిపోయిన ఆ ఓటమిని అంగీకరిస్తాయి. తద్వారా ప్రజల్లో ఎప్పడు ఉంటాయి. కానీ గెలిస్తే ఇప్పుడే గెలుస్తాం. లేకపోతే మళ్లీ ఎప్పటికీ గెలవలేం లాంటి పదాలు ఉపయోగించడం వల్ల కార్యకర్తలు మనో ధైర్యం కోల్పోయే అవకాశం ఉంది.  వైసీపీని ఓడించేందకు ఈ సారి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు.


జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. ఇది పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నౌ ఆర్ నెవర్ వ్యాఖ్యలు పార్టీని కార్యకర్తలను తీవ్ర అయోమయానికి గురి చేస్తాయని ఆందోళన చెందుతున్నారు.



RRR Telugu Movie Review Rating

అమెరికా : అమెరికాలో దీపావళికి సెలవు ? భారతీయుల ప్రభావం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>