Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl70b4664b-183c-430f-9eaa-c53bbff985c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl70b4664b-183c-430f-9eaa-c53bbff985c9-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు ఐపిఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే మహేంద్ర సింగ్ ధోనీ లాంటి సీనియర్ క్రికెటర్ అటు క్రికెట్ రూల్స్ విషయంలో ఎంత క్లారిటీతో ఉంటాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడైనా ధోని రూల్స్ బ్రేక్ చేశాడు అంటే చాలు ఆ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు. కానీ ఒకవైపు రూల్స్ పాటిస్తూనే మరోవైపు ఇక Ipl{#}MS Dhoni;Cricket;Chennai;INTERNATIONALధోని లాంటి వ్యక్తి.. అలా ప్రవర్తించడంతో షాకయ్యా?ధోని లాంటి వ్యక్తి.. అలా ప్రవర్తించడంతో షాకయ్యా?Ipl{#}MS Dhoni;Cricket;Chennai;INTERNATIONALSun, 28 May 2023 09:45:00 GMTప్రపంచ క్రికెట్లో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు ఐపిఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే మహేంద్ర సింగ్ ధోనీ లాంటి సీనియర్ క్రికెటర్ అటు క్రికెట్ రూల్స్ విషయంలో ఎంత క్లారిటీతో ఉంటాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడైనా ధోని రూల్స్ బ్రేక్ చేశాడు అంటే చాలు ఆ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు.



 కానీ ఒకవైపు రూల్స్ పాటిస్తూనే మరోవైపు ఇక తనకు అనుకూలంగా అన్ని పరిస్థితులను మార్చుకుంటూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. ఇకపోతే ఇటీవల ipl లో భాగంగా క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్లో మహేంద్రసింగ్ ధోని చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో కాస్త విమర్శలు ఎదుర్కొనేలా చేస్తుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరూ కూడా సమయం వృధా చేయడానికి ఉండదు. కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం రూల్స్ కి విరుద్ధంగా సమయం వృధా చేశాడు. ఏకంగా తాను అనుకున్నట్లుగా పతీరణతో బౌలింగ్ చేసేందుకు ఏకంగా ఐదు నిమిషాలు వేస్ట్ చేశాడు మహేంద్రసింగ్ ధోని.



 ఇక ఇదే విషయంపై మాజీ క్రికెటర్ ఐసీసీ అంపైర్ హార్పర్ స్పందిస్తూ విమర్శలు గుప్పించాడు. క్వాలిఫైయర్ వన్ లో పతిరానతో 16 ఓవర్ వేయించేందుకు ధోని సమయం వృధా చేశాడు అంటూ విమర్శలకు గుప్పించాడు. కొందరు వ్యక్తులు క్రీడా చట్టాల కంటే.. క్రీడా స్ఫూర్తి కంటే పెద్దవాళ్లేమో.. ఓ మ్యాచ్ గెలవడానికి ధోని లాంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడం నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది అంటూ హార్పర్ చెప్పుకొచ్చాడు. ధోని అలా ప్రవర్తించిన సమయంలో సిచువేషన్ కంట్రోల్ చేయకుండా అంపైర్లు కేవలం నవ్వుతూ నిలబడ్డారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు హార్పర్.



RRR Telugu Movie Review Rating

అప్పుడు ఇబ్బంది పడ్డా.. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది : ప్రియాంక చోప్రా




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>