MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramd7281e4a-fe6c-4fc4-a1f4-f248e575d5a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramd7281e4a-fe6c-4fc4-a1f4-f248e575d5a0-415x250-IndiaHerald.jpgబ్లాక్ బష్టర్ సినిమాల నిర్మాతగా అందరిలో గుర్తింపు పొందిన బండ్ల గణేష్ మెగా కాంపౌండ్ కు అత్యంత సన్నిహితుడు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను విపరీతంగా ఆరాధించే ఈ నిర్మాత ‘గబ్బర్ సింగ్’ తరువాత ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ పవన్ తో మరొక సినిమా చేయలేకపోయిన అసంతృప్తి అతడికి ఉంది.ఆమధ్య కొంతకాలం రాజకీయాలలో యాక్టివ్ గా ఉండి ఆ రాజకీయాలు తనకు సరిపోవు అని తెలుసుకుని ప్రస్తుతం సినిమాలు తీయలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాల యాక్టివ్ గా ఉంటూ వివిధ విషయాల పై తన అభిప్రాయాలు తెలియచేస్తున్నాడు. ఈ పరిస్థితుల మధ్య trivikram{#}kalyan;producer;politics;Producer;Gift;bandla ganesh;trivikram srinivas;Cinemaత్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన బండ్ల గణేష్ కామెంట్స్ ?త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన బండ్ల గణేష్ కామెంట్స్ ?trivikram{#}kalyan;producer;politics;Producer;Gift;bandla ganesh;trivikram srinivas;CinemaSat, 27 May 2023 10:00:00 GMTబ్లాక్ బష్టర్ సినిమాల నిర్మాతగా అందరిలో గుర్తింపు పొందిన బండ్ల గణేష్ మెగా కాంపౌండ్ కు అత్యంత సన్నిహితుడు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను విపరీతంగా ఆరాధించే ఈ నిర్మాత ‘గబ్బర్ సింగ్’ తరువాత ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ పవన్ తో మరొక సినిమా చేయలేకపోయిన అసంతృప్తి అతడికి ఉంది.



ఆమధ్య కొంతకాలం రాజకీయాలలో యాక్టివ్ గా ఉండి ఆ రాజకీయాలు తనకు సరిపోవు అని తెలుసుకుని ప్రస్తుతం సినిమాలు తీయలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాల యాక్టివ్ గా ఉంటూ వివిధ విషయాల పై తన అభిప్రాయాలు తెలియచేస్తున్నాడు. ఈ పరిస్థితుల మధ్య బండ్ల గణేష్ కు ఒక నెటిజన్ నుండి ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురైంది.



సినిమా నిర్మాతగా మారాలి అంటే ఏమి చేయాలి అంటు అడిగిన ఒక ప్రశ్నకు బండ్ల గణేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘గురుజీని కలవండి భారీ గిఫ్ట్ ఇవ్వండి నెరవేరుతుంది’ అంటూ ఒక సెటైర్ వేసాడు. అయితే ఈ సెటైర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేసే విధంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో గురూజీ అంటే వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు గుర్తుకు వస్తుంది.


వాస్తవానికి బండ్ల గణేష్ తీసిన ‘తీన్మార్’ మూవీ సమయం నుండి త్రివిక్రమ్ తో అతడికి మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఈమధ్యన గతంలో ఉన్నంతగా వీరిద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉండటంలేదు అంటూ గాసిప్పులు కూడ వచ్చాయి. ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ సలహాతో పవన్ కొందరు నిర్మాతలు తీసే సినిమాలకు వరసపెట్టి డేట్స్ ఇస్తున్నాడు. ఇలా చేయడం వల్ల త్రివిక్రమ్ కు ఆర్థికంగా కూడ లాభిస్తోంది అంటు కొందరు గాసిప్పులు ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ ఇలా సెటైర్ వేసి ఉంటాడు అంటూ కొందరి అభిప్రాయం..







RRR Telugu Movie Review Rating

త్రివిక్రమ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్...!!

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>