MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunacd8de1f4-60de-4e58-ac45-f994904739c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunacd8de1f4-60de-4e58-ac45-f994904739c3-415x250-IndiaHerald.jpg వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న అక్కినేని హీరోల పరిస్థితి అయోమయంగా మారడంతో వారిలో పూర్తిగా అంతర్మధనం మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి. జరిగిన పొరపాట్ల గురించి ఆలోచనలు చేస్తూ సమయం వృధా చేసుకునే దానికంటే మంచి కథలు దర్శకులను ఎంచుకుని వరసపెట్టి సినిమాలు చేయాలి అన్న నిర్ణయానికి అక్కినేని కాంపౌండ్ హీరోలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నిర్ణయంలో భాగంగానే నాగార్జున తన కొత్త మూవీ ప్రారంభానికి లైన్ క్లియర్ చేసిన్నట్లు తెలుస్తోంది. రచయిత బెజవాడ ప్రసన్నను దర్శకుడుగా మార్చి తీయబోతున్న మళయాళ రీమేక్ కు లైనnagarjuna{#}anoushka;Akkineni Nagarjuna;annapurna;renu desai;March;UV Creations;Mister;Athadu;akhil akkineni;Remake;June;Naga Chaitanya;Writer;News;Cinemaవ్యూహాలు మార్చుకుంటున్న అక్కినేని హీరోలు !వ్యూహాలు మార్చుకుంటున్న అక్కినేని హీరోలు !nagarjuna{#}anoushka;Akkineni Nagarjuna;annapurna;renu desai;March;UV Creations;Mister;Athadu;akhil akkineni;Remake;June;Naga Chaitanya;Writer;News;CinemaSat, 27 May 2023 13:58:30 GMT
వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న అక్కినేని హీరోల పరిస్థితి అయోమయంగా మారడంతో వారిలో పూర్తిగా అంతర్మధనం మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి. జరిగిన పొరపాట్ల గురించి ఆలోచనలు చేస్తూ సమయం వృధా చేసుకునే దానికంటే మంచి కథలు దర్శకులను ఎంచుకుని వరసపెట్టి సినిమాలు చేయాలి అన్న నిర్ణయానికి అక్కినేని కాంపౌండ్ హీరోలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ నిర్ణయంలో భాగంగానే నాగార్జున తన కొత్త మూవీ ప్రారంభానికి లైన్ క్లియర్ చేసిన్నట్లు తెలుస్తోంది. రచయిత బెజవాడ ప్రసన్నను దర్శకుడుగా మార్చి తీయబోతున్న మళయాళ రీమేక్ కు లైన్ క్లియర్ కావడంతో ఈమూవీ షూటింగ్ జూన్ 2వ వారంలో ప్రారంభం కాబోతోంది. ఇక నాగచైతన్య విషయానికి వస్తే ‘కష్టడీ’ ఫెయిల్యూర్ తో షాక్ కు గురైన అతడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా యంగ్ డైరెక్టర్స్ చెపుతున్న కథలను వరసపెట్టి వినడమే కాకుండా ఒకేసారి రెండు సినిమాలను లైన్ క్లియర్ చేసి వాటి షూటింగ్ ను మొదలుపెట్టే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


అఖిల్ విషయానికి వస్తే అతడు భారీ సినిమాలకు సరిపోడు అన్న కామెంట్స్ ను తిప్పికొట్టడానికి ఒక పక్కా వ్యూహాన్ని నాగార్జున అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తో భాగస్వామ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ ను జత కలిపి ఒక భారీ బడ్జెట్ సినిమాను కొత్త దర్శకుడుతో నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని టాక్.


ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ ‘ఆదిపురుష్’ మూవీ పనుల్లో చాల బిజీగా ఉంది. ఆ మూవీ విడుదల తరువాత అనుష్క నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ శెట్టి’ విడుదల కావలసి ఉంది. ఈ రేణు సినిమాల వ్యవహారాలు పూర్తి అయిన తరువాత అఖిల్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది అంటున్నారు. అక్కినేని కాంపౌండ్ హీరోల పరిస్థితి అయిపోయింది అని కామెంట్స్ చేస్తున్న వారికి గట్టి సమాధానం ఇచ్చే ఆలోచనలలో అక్కినేని హీరోలు ఉన్నారు అనుకోవాలి..  







RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో తో కలిసి నాగచైతన్య పై రివేంజ్ తీర్చుకుంటున్న సమంత..!?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>