Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attackb8c86b89-9fe4-4e2a-9226-d5ecbb39e6ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attackb8c86b89-9fe4-4e2a-9226-d5ecbb39e6ed-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వీధి కుక్కలు ఎంతలా రెచ్చిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషులకి వీధి కుక్కలకి మధ్య పుట్టుకతోనే జాతి వైరం ఉందేమో అన్న విధంగా వాటి ప్రవర్తన ఉంది. మనుషులను చూస్తే చాలు కోపంతో రగిలిపోతూ దారుణంగా దాడులు చేస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరంలో ఏకంగా అభం శుభం తెలియని చిన్నారిని వీధి కుక్కలు దారుణంగా కొరికి చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటన తర్వాత వీధి కుక్కల నివారణకు ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. అయితAttack{#}Kanchana;Parents;Government;Dogs;Hyderabadరెచ్చిపోయిన వీధి కుక్కలు.. చావు బతుకుల్లో ఉన్న చిన్నారి?రెచ్చిపోయిన వీధి కుక్కలు.. చావు బతుకుల్లో ఉన్న చిన్నారి?Attack{#}Kanchana;Parents;Government;Dogs;HyderabadSat, 27 May 2023 11:15:00 GMTప్రస్తుతం వీధి కుక్కలు ఎంతలా రెచ్చిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషులకి వీధి కుక్కలకి మధ్య పుట్టుకతోనే జాతి వైరం ఉందేమో అన్న విధంగా వాటి ప్రవర్తన ఉంది. మనుషులను చూస్తే చాలు కోపంతో రగిలిపోతూ దారుణంగా దాడులు చేస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరంలో ఏకంగా అభం శుభం తెలియని చిన్నారిని వీధి కుక్కలు   దారుణంగా కొరికి చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటన తర్వాత వీధి కుక్కల నివారణకు ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది.



 అయితే వీధి కుక్కల దాడిలో చిన్నారి చనిపోయిన ఘటన గురించి మరవక ముందే మరికొన్ని ప్రాంతాల్లో కూడా దారుణంగా వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇదంతా చూసిన తర్వాత ఎక్కడైనా వీధి కుక్కలు కనిపిస్తే అటు వెళ్లడమే మానుకుంటున్నారు. అయితే రోడ్లమీద కుక్కలు లేకుండా నివారణకు చేపట్టిన చర్యలు కేవలం కొన్ని రోజులుపరిమితం అయ్యాయి అని చెప్పాలి. ఇలా అధికారుల మొక్కుబడి చర్యల వల్ల వీధి కుక్కల దాడిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.



 ప్రతిరోజు ఏదో ఒక మూలన కుక్కలు దాడిలో చిన్నారులు గాయపడిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో మరోసారి కాంచన బాగ్ లోని వీధిలో ఒక చిన్నారిపై వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయ్. డిఆర్డిఓ టౌన్షిప్ లో మూడు సంవత్సరాల బాలుడు పై ఐదు కుక్కలు దాడి చేశాయి. రోడ్డు పక్కన ఉన్న కుక్కలు ఒంటరిగా వస్తున్న పిల్లాడిపై ఎగబడ్డాయి. ట్యూషన్ కి వెళ్ళిన పిల్లాడిపై కుక్కలు దాడి చేశాయని తెలిసి వెంటనే తల్లిదండ్రులు పరుగున అక్కడికి వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక పిల్లాడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  ఈ ఘటన స్థానికంగా సంచలనగా మారింది.



RRR Telugu Movie Review Rating

త్రివిక్రమ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్...!!

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>