MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maa-sabhyatwam-raddu-cheyadam-pai-spandinchina-karate-kalyani6387e899-8080-4375-986e-ac51938e8c60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maa-sabhyatwam-raddu-cheyadam-pai-spandinchina-karate-kalyani6387e899-8080-4375-986e-ac51938e8c60-415x250-IndiaHerald.jpgతాజాగా మా అసోసియేషన్ కరాటే కళ్యాణిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే కరాటే కళ్యాణిని మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు నోటీసులు కూడా జారీ చేశారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి అంటూ మా అసోసియేషన్ ఈనెల 16వ తేదీన ఆమెకు షోకాస్ నోటీసులు జారీ చేసినా.. ఆమె మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అలాగే మా అసోసియేషన్ పెట్టుకున్న నిబంధనలను ఉల్లంఘించింది అని అందుకే ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు మా సభ్యులు తాజాగా వెల్లడించారKARATE KALYANI{#}krishnudu;maa association;Manam;kalyani;manchu vishnu;NTR;courtమా సభ్యత్వం రద్దు చేయడంపై స్పందించిన కరాటే కళ్యాణి..!మా సభ్యత్వం రద్దు చేయడంపై స్పందించిన కరాటే కళ్యాణి..!KARATE KALYANI{#}krishnudu;maa association;Manam;kalyani;manchu vishnu;NTR;courtFri, 26 May 2023 12:00:00 GMTతాజాగా మా అసోసియేషన్ కరాటే కళ్యాణిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే కరాటే కళ్యాణిని మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు నోటీసులు కూడా జారీ చేశారు.  ఇక సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి అంటూ మా అసోసియేషన్ ఈనెల 16వ తేదీన ఆమెకు షోకాస్ నోటీసులు జారీ చేసినా.. ఆమె మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అలాగే మా అసోసియేషన్ పెట్టుకున్న నిబంధనలను ఉల్లంఘించింది అని అందుకే ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు మా సభ్యులు తాజాగా వెల్లడించారు.

దీనిపై స్పందించిన కరాటే కళ్యాణి పూర్తిస్థాయిలో ఫైర్ అవుతున్నారనే చెప్పాలి.. అసలు విషయంలోకి వెళితే ఖమ్మంలో 54 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై అభ్యంతరాలు రావడంతో కోర్టులో కూడా వాదనలు బాగా జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ కృష్ణుడి రూపంలో ఉండడమే అభ్యంతరాలను వ్యక్తం చేసేలా చేస్తోంది.  కరాటే కళ్యాణి తమ యాదవ కులానికి కలంకం కలుగుతుంది అంటూ విమర్శలు చేస్తూ కోర్టుకెక్కగా కోర్టు ఆమెకు మద్దతుగా నిలిచినా ప్రజలు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు.

కరాటే కళ్యాణి మాట్లాడుతూ...నేను చేసిన తప్పు ఏమిటో నాకు మాత్రం అర్థం కావడం లేదు నేను మహానటుడు ఎన్టీఆర్కు వ్యతిరేకం కాదు.. కృష్ణుడి రూపంలో ఆయన విగ్రహం పెడితే సమాజంలోకి తప్పుగా వెళుతుందని భావించాను. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే ఇక దేవుళ్ళ విగ్రహాలు ఎందుకు ? మనం ఎందుకు ఆ విగ్రహాలను పూజించాలి ?అంటూ ఆమె ప్రశ్నించారు. మాకు శ్రీకృష్ణుడు ఎంతో ఇష్టమైన దైవము అక్కడ ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే దేవుడికి అప్రతిష్ట జరుగుతుందని మేము నమ్ముతాము అందుకే ఆ విగ్రహ ఏర్పాటును ఆపేయండి అని అడిగాను.  కానీ ఎందుకు నాకు సభ్యత్వం నుంచి తొలగించారు.. అన్నది మాత్రం అర్థం కావడం లేదు అంటూ తెలిపింది.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ దేవర నుండి అదిరిపోయే అప్డేట్..!?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>