PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-akhila-nandyala-tdp-lokesha15c23e9-764d-4c13-a04e-3fa68c041608-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-akhila-nandyala-tdp-lokesha15c23e9-764d-4c13-a04e-3fa68c041608-415x250-IndiaHerald.jpgఅరెస్టవ్వటం, రిలీజ్ అవ్వటం అఖిలకు కొత్తేమీకాదు. కాకపోతే నంద్యాల, ఆళ్ళగడ్డలో నారా లోకేష్ పాదయాత్రను మాజీమంత్రి మిస్ చేసుకోవటమే ఇంపార్టెంట్. తనకు చాలా కీలకమైన రెండు నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్రకు వచ్చారు. ఆ సమయంలో ఓవర్ యాక్షన్ చేసి తన బలమేమిటో ప్రదర్శించాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం తన ప్రత్యర్ధైన సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఆయన మద్దతుదారులపై తన మద్దతుదారులతో దాడిచేశారు. bhuma akhila nandyala tdp lokesh{#}Lokesh;Bonda;Nara Lokesh;Bhuma Akhila Priya;Elections;Lokesh Kanagarajరాయలసీమ : గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా ?రాయలసీమ : గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా ?bhuma akhila nandyala tdp lokesh{#}Lokesh;Bonda;Nara Lokesh;Bhuma Akhila Priya;Elections;Lokesh KanagarajFri, 26 May 2023 03:00:00 GMT


అసలే వివాదాల్లో ముణిగితేలుతున్నారు. అదనంగా చాలా కేసులున్నాయి. దీనిపైన ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. టికెట్ ఇస్తారో లేదో తెలీదు. ఈ నేపధ్యంలో ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ రూటే వేరు కదా. అందుకనే దూకుడుప్రదర్శించి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారనే టాక్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే హత్యానేరం కేసులో రిమాండులో ఉన్న  బుధవారమే అఖిల రిలీజ్ అయ్యారు.





అరెస్టవ్వటం, రిలీజ్ అవ్వటం అఖిలకు కొత్తేమీకాదు. కాకపోతే నంద్యాల, ఆళ్ళగడ్డలో నారా లోకేష్ పాదయాత్రను మాజీమంత్రి మిస్ చేసుకోవటమే ఇంపార్టెంట్. తనకు చాలా కీలకమైన రెండు నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్రకు వచ్చారు. ఆ సమయంలో ఓవర్ యాక్షన్ చేసి తన బలమేమిటో ప్రదర్శించాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం తన ప్రత్యర్ధైన సీనియర్ నేత  ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఆయన మద్దతుదారులపై తన మద్దతుదారులతో దాడిచేశారు.





ఫలితంగా అఖిలపైన హత్యాయత్నం కేసు, అరెస్టు, రిమాండ్ చకచకా జరిగిపోయింది. తన ఓవర్ యాక్షన్ వల్ల ఏమైందంటే లోకేష్ పాదయాత్రలో పాల్గొనే అవకాశాన్ని మాజీమంత్రి చెడగొట్టుకున్నారు. లోకేష్ వచ్చినపుడు కాస్త ఓపికపట్టి రెండు నియోజకవర్గాలో జనాలను సమీకరించటంలో తన బలాన్ని ప్రదర్శించుంటే కత వేరేవిధంగా ఉండేదేమో. ఆళ్ళగడ్డలో టికెట్ అడిగేందుకు అఖిలకు, ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు చంద్రబాబునాయుడు, లోకేష్ కు అవకాశముండేది. కానీ ఆ విషయాలన్నింటినీ వదిలేసి పార్టీలోని తన ప్రత్యర్ధిపై దాడిచేయటంలో తన బలాన్ని ప్రదర్శించటంతో నాలుగురోజులపాటు లోకేష్ తో పాదయాత్రలో పాల్గొనే బంగారంలాంటి అవకాశాన్ని అఖిల పొగొట్టుకున్నారు.





రిమాండులో ఉన్న అఖిల బెయిల్ మీద బయటకు వచ్చేటప్పటికి నంద్యాల, ఆళ్ళగడ్డలో లోకేష్ పాదయాత్రను ముగించుకుని కడపలోకి ఎంటరయ్యారు. జరిగిన గొడవపై వేసిన త్రిసభ్య కమిటి కూడా తప్పంతా అఖిలదే అని రిపోర్టిచ్చిందట. ఏవీకి పార్టీలో మాజీ ఎంఎల్ఏ, పాలిట్ బ్యూరో సభ్యుడు, వియ్యంకుడైన బోండా ఉమ గట్టి మద్దతిస్తున్నారు. అఖిలపైన గట్టి యాక్షన్ తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఏ కోణంలో చూసినా అఖిల గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యారనే చెప్పాలి.










RRR Telugu Movie Review Rating

రాయలసీమ : గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>